RedBus Success Story in Telugu
Success Stories

Redbus Success Story in Telugu

అవసరం అన్వేషణకి మూలం. ఈరోజున మనం అనుభవిస్తున్న వస్తువులన్నీ ఏదోక రోజు ఒక అవసరం నుంచి పుట్టినవే…

అలా పుట్టినదే Redbus Story కూడా…

Redbus సృష్టికర్త అయిన ‘ఫణీంద్ర సామ’ నిజామాబాద్ జిల్లాలో తడపకల్ అనే గ్రామంలోజన్మించారు.

RedBus CEO Phanindra Sama
RedBus CEO Phanindra Sama

బిట్స్ పిలానీలో ఎలెక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన బెంగుళూర్ లో జాబ్ చేస్తున్న సమయంలో 2 వారాలకి ఒకసారి బస్సులో ఇంటికి వెళ్లేవారు. ఇలా ఒక సంవత్సరం మొత్తం ఒక ట్రావెల్ ఏజెంట్ దగ్గర టిక్కెట్ కొనుక్కుని ప్రయాణంచేసేవారు..

అలా 2005 సంవత్సరం దీపావళికి ఇంటికి వెళ్దామని ట్రావెల్ ఏజెంట్ దగ్గరకి వెళ్లిన ఫణీకి ఆరోజు బస్సు టికెట్ దొరకలేదు. అక్కడే దగ్గర్లో ఉన్న మరో 4,5 ఏజెంట్లని టికెట్ కోసం అడగగా అక్కడ కూడా ఫలితం లేకపోయింది. ఇక చేసేదేమీ లేక రూమ్ కి వెనుతిరుగుతారు ఫనీంద్ర..

అలా వెనక్కి వచ్చిన ఫణికి ఇంజినీర్ ని అయ్యి ఉండి ఇలాంటి సమస్యకి పరిష్కారమేమి కనిపెట్టలేనా అనిపించింది…

అంతే… టికెట్ కోసం వెళ్లిన చోట జరిగిన సంఘటనని ఒకసారి తలచుకున్నాడు.

“నేను మొదట వెళ్లిన ఏజెంట్ తనకి తెలిసిన 5 గురు డ్రైవర్లకే ఫోన్ చేసాడు. రెండో ఏజెంట్ తనకి తెలిసిన ఇద్దరు,ముగ్గురు డ్రైవర్లకు ఫోన్ చేసి టికెట్ లు లేవని చెప్పేసాడు..

మొత్తం బెంగూళూర్ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు సుమారుగా ఒక 50 ఉన్నాయి అనుకుంటే…అందులో ఏజెంట్లు పది మంది డ్రైవర్ల కే ఫోన్ చేశారు.

అంటే.. మిగిలిన 40 బస్సు డ్రైవర్ల నంబర్లు, బస్సుల సమాచారం కనుక ఏజెంట్ ల దగ్గర ఉండి ఉంటే నేను ఈ దీపావళీ ఇంటి దగ్గర చేసుకునేవాడినేమో”…అనుకుంటాడు.

దీనికి పరిష్కారంగా.. బెంగుళూర్ నుంచి హైదరాబాద్ వెళ్లే మొత్తం బస్ డ్రైవర్ల యొక్క నంబర్లు మరియు బస్సు వివరాలు ఒక వెబ్సైట్ పెట్టి, అందులో పొందుపరచాలనుకున్నాడు.

అదే ఆలోచనని తన ఆరుగురు రూమ్మేట్ లతో పంచుకున్నాడు ఫనీంద్ర . వాళ్ళ అందరికీకూడా ఈ ఆలోచన బాగా నచ్చడంతో ఈ సమస్యకి పరిష్కారం చూపించే దిశగా కస్టమర్లకు, డ్రైవర్లకు మరియు ఏజెంట్లకు లబ్ధి చేకూరేలా ఒక సాఫ్ట్ వేర్ తయారు చేద్దామనుకుంటారు.

redBus Success Story
redBus Success Story

ప్రోగ్రామింగ్ రాకపోయినప్పటికి పుస్తకాలు కొనుక్కుని మరీ నేర్చుకుని 6 నెలలో ఒక కొత్త సాఫ్ట్ వేర్ ని తయారు చేస్తారు ఆ మిత్రులు.

సాఫ్ట్ వేర్ అంతా డ్రైవర్లని మరియు చదువురాని వారిని అలా అందరిని దృష్టిలో పెట్టుకుని, టికెట్ బుక్ చేసిన వెంటనే Booked , Reserved, waiting ఇలాంటి వర్డ్స్ రాకుండా కలర్ కోడ్ లతో అందరికి సింపుల్ గా అర్థమయ్యేలా మరియు ఆకర్షించేలా డిజైన్ చేశారు ఫణి & టీం.

ఇక్కడి వరకు అంతా బాగానే సాగింది. వీళ్ళు తయారు చేసిన సాఫ్ట్ వేర్ ని బస్సుల యజమానుల దగ్గరికి మరియు డ్రైవర్ ల దగ్గిరకి తీసుకువెళ్తారు. కానీ, దీనిని కొనడానికి ఎవరు ముందుకురారు. ఎందుకంటే… దీనికోసం మళ్ళీ కంప్యూటర్ అవి కొనాలి అదొక ఖర్చు అని ఆలోచించేవాళ్లే అంతా…

అప్పటివరకు ఉత్సాహంగా ఉన్న టీంలో కొంచెం నిరుత్సాహం నెలకొంటుంది.

అదే సమయంలో ఈ స్నేహితులకి ‘టై’ అనే ఒక స్వచ్చంధ సంస్థ స్టార్టప్ లకి సహాయం చేసి, వాళ్ళకి ఎదురయ్యే సమస్యలకి పరిష్కారాలు చూపుతుందని తెలిసి..వాళ్ళని ఆశ్రయిస్తారు…

అంతే…టై యొక్క సహకారంతో ఆరోజు నుండి Redbus కి తిరుగులేకపోయింది… అంచలంచలుగా ఎదుగుతూ మన దేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా విస్తరింపబడింది.

ప్రస్తుతం 10 మిలియన్ కి పైగా ప్రజలు రెడ్ బస్ యాప్ ని వాడుతున్నారు అంటే Redbus ఎంతటి సక్సెస్ ను సాధించిందో వేరే చెప్పనవసరం లేదు.

ఒకే ఒక్క ఆలోచన మొత్తం ప్రయాణ రంగంలోనే పెనుమార్పుని తీసుకొచ్చింది అని చెప్పొచ్చు..

ప్రస్తుతం ఫనీంద్ర తెలంగాణా రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు.

ఏదీ ఏమైనప్పటికి సమస్యను కూడా సానుకూలంగా మార్చుకుని, అందరి ప్రయాణాన్ని సుఖమయం చేసిన ఫణీంద్ర లాంటి వారి జీవితం మన అందరికీ స్ఫూర్తిదాయకం.

Ok ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే మీ స్నేహితులు అందరితో Share చేసుకోండి. దీని మీద మీ అభిప్రాయాన్ని మాత్రం క్రింది కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.

You May Also Like: Swiggy Success Story తెలుగులో…