Zomato-Success Story-in-Telugu-StartupStories-Telugu-TeluguForbes-telugustories
Success Stories,  Uncategorized

Zomato Success Story in Telugu

Zomato ఈ పేరు వినని వారు అంటూ ఎవరూ ఉండరు. యూట్యూబ్ లో ఏదైనా వీడియో చూద్దామని మొదలుపెట్టి పూర్తి అయ్యేలోగా కనీసం రెండు సార్లు అయినా ‘ఆర్డర్ ఫుడ్ ఆన్లైన్ ఆన్ జొమాటో’ అని వినిపిస్తుంటుంది. అంతే కాదు మనకి నచ్చే రుచులను, మనకి మెచ్చే రెస్టారెంట్ల నుండి నిమిషాలలో మన ముందు ఉంచుతుంది.

ఒక సాధారణమయిన వెబ్సైటుగా మొదలయ్యిన ఈ Zomato సంస్థ ఇంత ఫేమస్ ఎలా అయ్యింది? Zomato యొక్క సక్సెస్ స్టోరీ ఏమిటి? Zomato కి సంబంధించిన ఆసక్తికరమయిన విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

జొమాటో సంస్థను దీపేంధర్ ఘోయల్ మరియు పంకజ్ చద్దాహ్ అనే ఇద్దరు స్నేహితులు కలిసి 2008 లో స్థాపించారు. IIT ఢిల్లీలో ఇంజనీరింగ్ చదువుకున్న వీరిద్దరూ అదే నగరంలోని ‘బేయన్’ అనే సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఈ బెయన్ కంపెనీలోని కాంటీన్ లో.. చుట్టుపక్కల వున్న అన్ని రెస్టారెంట్ ల యొక్క మెనూ కార్డులు అందుబాటులో ఉండేవి.

Zomato Founders Pankaj Chaddah and Deepinder Goyal
Zomato Founders Pankaj Chaddah and Deepinder Goyal

అక్కడ ఉద్యోగులు మధ్యాహ్న భోజన సమయంలో మెనూ కార్డుల కోసం వరుసలో నుంచుని, కార్డు దొరికిన తరువాత వారికి నచ్చిన ఐటమ్స్ ని, నచ్చిన రెస్టురెంట్లకి ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకునేవారు. ఈ ప్రక్రియలో భాగంగానే ఒకరోజు లైనులో నుంచున్న దీపేందర్ కు ఒక ఆలోచన తట్టింది. ఇలా గంటలు గంటలు లైనుల్లో నుంచుని సమయాన్ని వృధా చేసేబదులు ఈ మెనూ కార్డులను ఆన్లైనులో పొందుపరిస్తే ఎలా ఉంటుంది? అని..

ఈ ఆలోచనను తన తోటి సహోద్యోగి అయిన పంకజ్ కు చెప్పడంతో ఇద్దరికీ నచ్చి.. ఇరువురూ కలిసి ‘Foodiebay’ అనే వెబ్సైటును స్టార్ట్ చేసారు. ఈ వెబ్సైటులో ఢిల్లీ నగరంలో గల అన్ని రెస్టారెంట్లలో దొరికే ఫుడ్ ఐటమ్స్, మరియు వాటియొక్క ధరలను సేకరించి అందులో పొందుపరిచారు.

zomatos 1st Name
zomatos 1st Name

దీనిని సమయం ఆదాచేసే మరియు లైనులో నిలబడే శ్రమని తగ్గించే సదావకాశంగా భావించిన ఆ సంస్థ యొక్క ఉద్యోగులు ఈ వెబ్సైటుని భోజన సమయాలలో బాగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. . ఈ విధంగా Zomato సంస్థ మొట్టమొదటిగా Foodiebay అనే పేరుతో మొదలయ్యింది. తమసేవలకు ఢిల్లీ నగర ప్రజల యొక్క అనూహ్య స్పందన లభించడంతో వీరిద్దరూ ఉద్యోగానికి సెలవుచెప్పి తమ ఇంటి వద్దనే కూర్చుని ఈ వెబ్సైటుని అభివృద్ధి చేసే పనిలో పడ్డారు.

Deepinder Goyal and Pankaj Chaddah left the Job and Working to Build a Website
Deepinder Goyal and Pankaj Chaddah left the Job and Working to Build a Website

ఇదే పేరుతో రెండు సంవత్సరాలు నడిచిన ఈ సంస్థ.. అప్పట్లో ప్రసిద్ధ ఈ-కార్ట్ సంస్థ అయిన ebay అనే పేరుకి Foodiebay దగ్గరగా ఉండటంతో ఈ పేరుని మార్చుదాం అనుకుని నిశ్చయించుకుంటున్న సమయంలోనే ebay సంస్థ నుండి Foodiebay కి లీగల్ నోటీస్ రావడంతో పేరు మార్చక తప్పలేదు.

మంచి పేరు, జనాలకి పలకడానికి సులభంగా, నానుడి పదంగా ఉండే మరియు వంటలకి సరిపోయే పేరు గురించి ఆలోచనలో పడ్డ స్నేహితులకు Tomato కి  Zo తగిలించి Zomato అని పెడితే బావుంటుంది అనిపించి 2010 నవంబర్ లో Foodiebay ని కాస్తా Zomato.com గా నామకరణం చేశారు.

ఆ విధంగా Zomato పేరుతో 2011 లో భారత దేశంలో ప్రముఖ నగరాలయినటువంటి బెంగుళూరు, పూణే, చెన్నై, హైదరాబాద్ మరియు అహ్మదాబాద్ లలో లాంఛనంగా తమ సేవలను మొదలుపెట్టారు .

Zomato Logo
Zomato Logo

Zomato కి అన్ని నగరాలలో మంచి ఆదరణ లభించడంతో స్నేహితులకి ఒక సందిగ్ధత ఏర్పడింది.

మన దేశంలోనే ఫుడ్ ఐటమ్స్ తో పాటుగా మిగిలిన అన్నిరకాల షాపింగులకి సంబంధించిన సమాచారం ఒకే వెబ్సైటులో అందుబాటులో ఉంచడమా? లేక ఈ ఫుడ్ ఐటమ్స్ సమాచారమే వివిధ దేశాలలో కూడా విస్తృత పరచడమా? అని..

వీటిలో రెండోవదే సులభమని నిశ్చయించుకున్న వీరు.. 2012 లో Zomato సేవలను ప్రపంచ స్థాయికి విస్తృత పరిచారు. ప్రపంచ దేశాలు అయినటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, కతర్, యూకె, ఫిలిప్పీన్స్, సౌత్ ఆఫ్రికా దేశాలకు.. 2013 లో న్యూజిలాండ్, టర్కీ, బ్రెజిల్, ఇండోనేషియా,కెనడా లాంటి మొత్తం 24 ప్రపంచ దేశాలకు Zomato విస్తరింపచేశారు.

ఇలాంటి సేవలు లేని దేశంలో కొత్తగా సేవలు అందించడం.. లేదా ఇలాంటి సేవలు అందించే కంపెనీలను కొనేయడం.. దీపేందర్ అనుసరించిన ప్రణాళిక.

కేవలం మెనూ కార్డ్స్, టేబుల్ బుకింగ్ సదుపాయాలే కాకుండా డోర్ డెలివరీ సదుపాయం కూడా అందుబాటులో ఉంచడంతో Zomato తిరుగులేని ఆప్ గా జనాల మైండ్ లోకి చొచ్చుకుపోయింది.

Zomato Introducing Delivery Service
Zomato Introducing Delivery Service

ప్రస్తుతం 90 మిలియన్ యూజర్లతో ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తోందిఈ Zomato. ఒక్క చిన్ని ఆలోచన, ఎన్నో రాత్రుల కష్టం వీరిద్దరినీ ఈరోజున కోట్లకి అధిపతులని చేసింది.

సక్సెస్ కి అడ్డుదారి అంటూ ఏమిలేదు కష్టపడి సాధించవలసిందే అంటారు జొమాటో సీఈఓ దీపేందర్. ఏది ఏమైనప్పటికీ కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది అంటూ ఏమీ లేదని నిరూపించిన దీపేంధర్ మరియు పంకజ్ ల యొక్క జీవితం మనం అందరికీ స్ఫూర్తిదాయకం.

‘టన్నులకొద్దీ ఆలోచనల కన్నా ఒక ఔన్సు చర్య విలువైనది’

 

You May Also Like: Paytm Success Story in Telugu

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *