Tips-in-Telugu-TeluguForbes-Tips
Life Style,  Uncategorized

Tips to Young Age People in Telugu

1.ఇరవై ఏళ్ల వయసులో ఆలోచనలన్నీ కలగాపులగంగా ఉంటాయి. దేని మీడా మనసు స్థిరంగా నిలవదు. మీరు అలా కాకుండా ఒక నిర్ణయానికి రండి. డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, రచయిత కావచ్చు. లక్ష్యం విషయంలో మీకు స్పష్టత ఉంటే, దానికి చేరువ కావడం కష్టమేమీ కాదు.

Tips-in-Telugu-TeluguForbes
Set A Goal

2. పుస్తకాలు చదవడాన్ని మీ జీవన విధానంలో భాగంగా చేసుకోండి. పుస్తకాలు చదవడం వల్ల పరిపూర్ణ జీవితం పరిచయం అవుతుంది. మీ సబ్జెక్ట్ల పుస్తకాలు  వదిలి గొప్ప గొప్ప వారి జీవిత చరిత్రలు చదవడం అలవాటు చేసుకోండి.

Telugu Forbes-Tips-in-Telugu
Read Life Changing books

 

3. లేటుగా నిద్ర పోవడం వల్ల లేటుగా నిద్ర లేస్తాం. ఇదొక సర్కిల్. కొందరు రాత్రంతా ఏదో పని చేస్తూ గడుపుతారు. అలాంటి వారి ఆరోగ్యం అంతంత మాత్రమే అని గ్రహించాలి.

క్రమశిక్షణతో కూడిన జీవితం’ సౌకర్యంగా, సుఖంగా అనిపించకపోవచ్చు. కానీ అది మన అవసరం… వేళకు నిద్ర, వేళకు లేవడం అనేది క్రమశిక్షణతో కూడిన జీవితంలో భాగం అనే విషయం గ్రహించాలి.

TeluguForbes-Tips-in-Telugu
Go to Bed early and Get up Early

 

4.ప్రేమ అనేది ఎంత ముఖ్యం? డబ్బు ఎంత ముఖ్యం? ఈ రెండింట్లో మీకు ఏది ముఖ్యం? దీని గురించి ఆలోచించండి..

TeluguForbes-Tips-in-Telugu
Love or Money Which is Required to you in this Situation?

 

5.ఇరవై ఏళ్ల వయసులో మంచి చెడు గురించి పెద్దగా ఆలోచించం. మనకు తెలియకుండానే ఇతరులను మాటలతో గాయపరుస్తుంటాం. మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం? అనేదాన్ని ఎప్పటికప్పుడు కని పెట్టుకొని ఉండండి.

వేరేవాళ్ల హృదయాలను గాయపరచకండి. దయతో ప్రవర్తించండి. అసంతృప్తిని అవతలకు నెట్టి సంతృప్తిగా జీవించండి.

TeluguForbes-Tips-in-Telugu
Think Before Speak

6.ఈ సమాజంలో ఏదీ సవ్యంగా జరగడం లేదు. అంతమాత్రాన ఎప్పుడూ కోపంతో మండిపడాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న విషయానికీ కన్నెర్ర చేసి గుండెల్లో రక్తం వేగాన్ని పెంచుకోవాల్సిన పనిలేదు. మనం ఆగ్రహంగా ఉన్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. కోపానికి దూరంగా జరగండి. ప్రశాంతంగా ఉండండి..

TeluguForbes-Tips-in-Telugu
Be Cool Don’t get Anger

 

Thank You

9 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *