Success Stories,  Uncategorized

Swiggy Success Story In Telugu

‘ఎక్కడో ఒక చోట జరిగిన చిన్న సంఘటన వేరే ఎక్కడో జరిగే పెద్ద పెనుమార్పుకి కారణమవ్వొచ్చు’ దీనినే బట్టర్ ఫ్లై ఎఫెక్ట్ అని అంటాం.

అలా… ఎక్కడో బిట్స్ పిలానీలో చదువుకోసం వెళ్లిన శ్రీహర్ష మరియు నందన్ రెడ్డి అనే ఇద్దరి వ్యక్తుల కలయిక ఈరోజు Swiggy రూపుదాల్చుకోవడానికి మరియు దాని సక్సెస్ కి కారణమయ్యింది.

ఈరోజున మనకి కావలసిన రెస్టారెంట్ ల నుంచి కావలసిన ఫుడ్ మన ఇంటికి నిమిషాలలో వచ్చేస్తోంది అంటే దానికి కారణం శ్రీహర్ష మరియు నందన్ రెడ్డి ల యొక్క కృషి ఫలితమే…

అసలు Swiggy ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలయ్యింది? Swiggy సృష్టికర్తలు ఎవరు? Swiggy ఇంత సక్సెస్ అవ్వడానికి గల ఏమిటి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

శ్రీహర్ష మరియు నందన్ లకి కాలేజీ రోజుల నుంచే ఏదోక బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి, మన కాళ్ళమీద మనం నిలబడి, 10 మందికి దారి చూపాలి అనే ఆలోచన ఉండేది.

ఈ ఆలోచనే వాళ్లకి చదువు అవ్వగానే మంచి మంచి ఉద్యాగాలు వచ్చినా… వాటిలో సంతృప్తిని ఇవ్వలేదు. . 2013 లో ఇద్దరు కలిసి “బండిల్” అనే ఒక కొరియర్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ చిన్న స్థాయి కంపెనీల నుండి వారి కస్టమర్లకు ప్రోడక్ట్స్ ని సరఫరాలు చేసే
వారధిగా ఉండేది. ఇలా ఒక సంవత్సరం పాటు ‘బండిల్’ కొనసాగింది.

ఆ తరువాత ఆ ఇద్దరికీ ఈ offline బిజినెస్ వల్ల పెద్ద లాభమేమి లేదనిపించింది.

అది 2014, అప్పుడప్పుడే ఈ- కామర్స్ సంస్థలు ఒక్కొక్కటిగా పైకి వస్తున్న రోజులు. అమెజాన్, రెడ్ బస్, ఫ్లిప్- కార్ట్, ఈ-బే లాంటి సంస్థలు ఆన్లైన్ లో సేవలని అందించడం మొదలు పెట్టి అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్నాయి.

వీటిని చూసి Inspire అయ్యిన హర్షకి ఆన్లైన్ లో ఫుడ్ డెలివరీ సర్వీస్ ను స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంద్హి అన్న ఆలోచన వచ్చింది… దీనినే తన స్నేహితుడైన నందన్ కి చెప్పాడు. తనకి కూడా ఈ ఆలోచన బాగా నచ్చడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఆలోచనని ఆగష్టు 14, 2014 న “Swiggy” అనే పేరుతో కార్యాచరన రూపంలో పెట్టారు హర్ష మరియు నందన్ లు.

Swiggy Success Story in Telugu
Swiggy Success Story in Telugu

అయితే ఈ ఆన్లైన్ బిజినెస్ కోసం కోడింగ్ అవి చేయడానికి ఒక వ్యక్తి కావాలి.. ఆ వ్యక్తికి కూడా ఇలాంటి అభిరుచే ఉంటే వాళ్ళ సక్సెస్ కి తిరుగు ఉండదు అని గ్రహించిన హర్ష మరియు నందన్ లు..IIT ఖరగ్పూర్ లో పట్టభద్రుడయిన “రాహుల్” ని తమ బిజినెస్ పార్టనర్ గా తీసుకున్నారు. .

మొత్తంమీద ముగ్గురు కలిసి రాత్రి, పగలు కూర్చుని Swiggi Appకి ఒక రూపం కల్పించి ఆరుగురు డెలివరీ బాయ్స్ తో మరియు సమీపంలోని 25 రెస్టారెంట్లతో డీలింగ్ కుదుర్చుకుని 2014 సెప్టెంబర్లో బెంగుళూరులో ‘Swiggy’ ని ప్రవేశపెట్టారు.

ఎక్కడో బెంగుళూరులో మొదలయ్యిన ‘Swiggy’ ఈ నాలుగు సంవత్సరాలలో మన దేశంలోని ఢిల్లీ, ముంబాయి, పూణే, బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, కలకత్తా, విశాఖపట్టణం లాంటి 14 ప్రముఖ పట్టణాలలో విస్తరించింది.

Swiggy Success Story
Swiggy Success Story

ప్రస్తుతం Swiggy దేశంలోని 35,000 రెస్టారెంట్ లతోనే డీలింగ్ కుదుర్చుకుని, 55,000 మంది డెలివరీ బాయ్స్ కి ఉద్యోగ అవకాశాలిస్తూ, 10 మిలియన్ డౌన్లోడ్స్ తో ఫుడ్ డెలివరీ లోనే అగ్రగామిగా నిలిచింది మరియు ముగ్గురు మిత్రులకు ఒక రుచికరమైన విజయాన్ని అందించింది.

చూడండి ఫ్రెండ్స్… మొదటి ఫెయిల్యూర్ తో ప్రయత్నం మానేసి ఎవరి దారి వారు చూసుకుని ఉండి ఉంటే ఈరోజున మనకి ఇంత మంచి ఫుడ్ డెలివరీ సర్వీస్ ఉండేది కాదు…

మనలో చాలా మంది చిన్న చిన్న సమస్యలకి బయపడి మధ్యలోనే తమ ప్రయత్నాలను వదిలేస్తూ ఉంటారు.

విజయం సాధించాలి అంటే మీరు ప్రత్యేకంగా ఏదో ఒక లక్ష్యం పైనే గురిపెట్టాలి.. ఒక సంవత్సరం వరకు, లేదా కొన్ని దశాబ్దాల పాటు…

మీరు చేయాలనుకున్నది ఏదైనప్పటికీ ఒక క్రీడాకారుడు అవ్వాలన్నా, ఒక గాయకుడు, ఒక రచయిత, లేదా ఒక వ్యాపారవేత్త ఏది అవ్వాలన్నా రాత్రికి రాత్రే లేదా కొన్ని వారాలలో లేదా కొన్ని నెలలలో విజయం మీకు దొరకదు…

ఓకే ఫ్రెండ్స్ , ఈ స్టోరీ మీకు నచ్చితే కింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మరిచిపోకండి..

You May Also Like: WhatsApp Successful Story  తెలుగులో…