Science

మనిషిలా ఆలోచించే సూపర్‌కంప్యూటర్‌ !

మనిషిలా ఆలోచించే సూపర్‌కంప్యూటర్‌:

ఈ ప్రపంచంలోని అంతుచిక్కని మరియు అర్థంకాని విషయాలలో మనిషి మెదడు ఒకటి..

మనం సాధించిన అద్భుతమైన ఈ సాంకేతిక అభివృద్ధికి కారణం మన మెదడు.

ఈ  భూ ప్రపంచంలో ఇప్పటివరకు మానవ మేధస్సుతో సరి సమానంగా పని చేసే పరికరం ఏదీ లేదు..

దీన్ని కూడా ఛేదించి ‘ మానవ మేధస్సు తో సరిసమానంగా పని చేసే సూపర్ కంప్యూటర్(స్పిన్నకర్) ని కనుగొన్నారు బ్రిటన్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవే త్తలు. ఇటీవలే దీన్ని స్విచ్చ్ ఆన్ చేశారు.

ఈ అద్భుతాన్నీ సాధించిన ఘనతకి కారణం కూడా మానవ మెదడు అనే చెప్పొచ్చు..

అసలు మన మెదడు ఎలా పనిచేస్తుంది ? ఎందుకు దానికి అంత ప్రత్యేకత..?

మన మెదడులో సుమారుగా 100 బిలియన్ సంఖ్యలో న్యూరాన్లు అని పిలవబడే కణాలు ఉంటాయి. ప్రతీ న్యూరాన్ కూడా మరో 1000 కి పైగా న్యూరాన్లతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. మన శరీరానికి కావలసిన సమాచారం సిగ్నల్స్ రూపంలో ఒక న్యూరాన్ నుండి మరో న్యూరాన్ కు బదిలీ అవుతూ ఉంటుంది.

Neurons in Human Brain

ఉదాహరణకి మన చెయ్యి ఏదైనా వేడి వస్తువుని తాకింది అనుకుందాం.. మనం వెంటనే మన చేతిని వెనక్కి తీసేస్తాం..

అంటే మన చేతికి సమీపంలో ఉన్న న్యూరాన్ల ద్వారా ఈ సమాచారం మెదడుకి చేరి, Parietal lobe రెస్పాండ్ అవ్వడం వల్ల స్పర్శ అనేది తెలిసి మనం వేడిగా ఉన్న వస్తువుని తాకాము అని మనకి అర్ధమవుతుంది. దీనికి Concious Mind, Alert Message ను రిలీజ్ చేస్తుంది. దీనికి respond అయిన Frontal lobe, Safety Alert గా ‘చేతిని వెనక్కి తీసెయ్యమని’ మెసేజ్ ని రిలీజ్ చేస్తుంది . ఇప్పుడు ఈ సమాచారం న్యూరాన్ల ద్వారా మన చేతికి చేరి మనం చేతిని వెనక్కి తీసేస్తాం…

ఈ ప్రక్రియ అంతా జరగడానికి పట్టే సమయం ఒక సెకను కన్నా తక్కువే…

మన మెదడు సెకనుకు 38,000 ట్రిలియన్ ఆపరేషన్స్ ను చేస్తుందట. ప్రపంచంలోనే super computer అయినటువంటి Blue Gene కంప్యూటర్, సెకనుకు మన బ్రెయిన్ చేసే పనిలో 0.002% మాత్రమే చేయగలదు.

అలాగే ప్రపంచంలోనే నాలుగవ super computer అయిన ‘K Computer’ కు మన బ్రెయిన్ సెకను కాలంలో చేసిన పనులని చేయడానికి 84,944 ప్రొసెసర్లు అవసరమయ్యాయి. అయినా కూడా… మన బ్రెయిన్ ఒక సెకనులో చేసే పనిని చేయడానికి ‘K Computer’ కు 40 నిమిషాలు పట్టింది.

దీనిని బట్టి మన బ్రెయిన్ కి ఉన్న శక్తి ఎంతటిదో, మన బ్రెయిన్ ఎంత పవర్ ఫుల్ నో మీకు అర్ధమయ్యే ఉంటుంది.

సరే… ఇప్పుడు అసలు టాపిక్ లోకి వద్దాం…

బ్రిటన్ లోని మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మానవుని మెదడులాగే ఆలోచించే సరికొత్త కంప్యూటర్ ను అభివృద్ధి చేశారు.

Spinnaker Computer
Spinnaker Computer
supercomputer-like-brain
supercomputer-like-brain

 

 

 

 

 

 

 

 

మిలియన్-ప్రాసెసర్- న్యూరల్ కోర్ స్పైకింగ్ న్యూరల్ నెట్‌వర్క్ (స్పిన్నకర్) ఆధారంగా పని చేసే ఈ కంప్యూటర్ సెకన్‌కు 200 మిలియన్ మిలియన్ల విశ్లేషణలు చేయగలదు.

ఇందులో వాడిన ఒక్కో చిప్ 10 కోట్ల ట్రాన్సిస్టర్లు కలిగి ఉంటుంది. ఈ సూపర్ కంప్యూటర్ తయారీకి మొత్తం 30 ఏళ్లు పడితే ఇందులో పరిశోధనకే 20 ఏళ్లు, నిర్మాణానికి మరో పదేళ్లు పట్టడం విశేషం.

ఈ సూపర్ కంప్యూటర్‌ను అభివృద్ధి చేసేందుకు మొత్తం రూ.141 కోట్లు ఖర్చయినట్లు పరిశోధకులు తెలిపారు.

మానవ మెదడులోని న్యూరాన్స్‌ లాగే ఈ కంప్యూటర్ స్పందనలు కలిగి ఉంటుందని, ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు. మానవుని మెదడులోని రహస్యాలను ఛేదించి, విశ్లేషించడానికి న్యూరో శాస్త్రవేత్తలకు ఈ సూపర్ కంప్యూటర్ ఎంతగానోఉపయోగపడుతుందని వర్సిటీకి చెందిన స్టీవ్ ఫర్బర్ అనే శాస్త్రవేత్త చెప్పారు.

అతి తక్కువ శక్తితో రోబోలు కూడా మానవుని వలే మాట్లాడేందుకు, నడిచేందుకు ఈ కంప్యూ టర్ దోహదపడుతుందని ఆయన అన్నారు.

ok ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ కనుక మీకు నచ్చినట్టయితే Like చేయండి, మీ స్నేహితులతో Share చేసుకోండి, ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి TeluguForbes ని రెగ్యులర్ గా Follow అవ్వండి.

You May Also Like:  ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు ఎందుకు? 

 

THANK YOU

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *