Success Stories,  Uncategorized

The Street Store.Org Success Story

 

The Street Store.Org Success Story in Telugu

“మనకిష్టమైన బట్టలు మనం వేసుకుందాం…. పక్కన పడేసిన బట్టలను లేనివారికిచ్చి వారి కళ్లలో ఆనందం చూద్దాం…’ అన్న ఆలోచనతో మొదలైందే ‘ద స్ట్రీట్ స్టోర్’. దీనిని ఎవరైనా ప్రారంభించొచ్చు, ఎవరైనా సహాయం చేయొచ్చు. మీ స్నేహితులతో కలిసి మీరు కూడా పేదలకి మీ వంతు సహాయాన్ని అందివ్వవచ్చు.

తమకవసరం లేనివి వేరేవారికి ఉపయోగపడతాయనుకుంటే చాలామంది ఇవ్వాలనే అనుకుంటారు. అవి బట్టలు కావొచ్చు, బూట్లు, చెప్పులు, దుప్పట్లు ఇలా ఏమైనా అవ్వొచ్చు.. కానీ నిజంగా వాటి అవసరం ఉన్నవారిని పట్టుకోవాలంటేనే సమస్య..

ఇక, తీసుకునే వారి విషయానికొస్తే… ఎంత నిరు పేదలైనా ఏది పడితే అది వేసుకోలేరు. వారికి సౌకర్యంగా ఉన్నవీ, నచ్చినవీ వేసుకున్నప్పుడు ఉండే సంతోషం వేరు. అందుకే, దాతలకు ఓ వేదికను ఏర్పాటు చేయడంతో పాటు పేదలకు కూడా అందరిలానే తమకు నచ్చింది తామే ఎంపికచేసుకునే అవకాశం కల్పించాలనుకున్నారు దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ కు చెందిన స్నేహితులు కైలీ లెవిటన్,మ్యాక్స్ పజక్. అలా పుట్టుకొచ్చిందే ద స్ట్రీట్ స్టోర్.

Street-Store-Story-in-Telugu
Street-Store-Story-in-Telugu

అద్దెలేని స్థలంలో అందరికీ అందుబాటులో ఉండేలా, నిర్వహణ ఖర్చులేకుండా ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఒక స్టాల్ నిర్వహించాలన్నది దీని నియమం.

‘స్ట్రీట్ స్టోర్’ ని ఎవరైనా ఎక్కడైనా పెట్టొచ్చు. అందుకు సంస్థ వెబ్ సైట్ www.thestreetstore.org లోకి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే చాలు. మన మెయిల్ కి ఓ డ్రాప్ బాక్స్ లింకు వస్తుంది. అందులో స్ట్రీట్ స్టోర్ ను నడపాల్సిన విధానమూ అవసరమైన సామగ్రి వివరాలూ వాలంటీర్ల టీ షర్టుల మీద ముద్రించుకోవడానికి కావల్సిన లోగో డిజైన్లూ ఉంటాయి. వాటి సహాయంతో మీరే మీ ఊరిలో ‘ద స్ట్రీట్ స్టోర్’ ఏర్పాటు చేయవచ్చు.

Street Store Success Story in Telugu
Street Store Success Story in Telugu

మీరు కూడా మీ స్నేహితులతో కలిసి ఒక ఆదివారం మీ ఊర్లో కానీ లేదా మీ కాలేజీ దగ్గర కానీ ‘స్ట్రీట్ స్టోర్’ ని ఏర్పాటు చేసి మీ వంతు చేయూతని పేద ప్రజలకి అందివ్వండి. అవి తీసుకుంటున్నప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని గమనించండి.. ఎంత డబ్బు ఇచ్చినా పొందలేని ఆనందాన్ని మీరు వాళ్ళ కళ్ళల్లో చూస్తారు.

You May Also like: Zomato Success Story in Telugu

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *