How to Set a Goal in Telugu
Success Stories

How to Set a GOAL | Explained in Telugu

కొత్త సంవత్సరం మొదలు కావడంతో చాలా మంది కొత్త కొత్త లక్ష్యాలను(Goal) ఏర్పరచుకునే ఆలోచనలో ఉంటారు. అయితే ఖచ్చితమయిన లక్ష్యాలను ఎలా ఏర్పరచుకోవాలి, ఆ లక్ష్యాలు(Goal) నెరవేరేందుకు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్పష్టత:

మొదటిగా లక్ష్యాన్ని(Goal) ఏర్పరచుకోవడంలో మీకంటూ ఒక స్పష్టత  ఉండాలి. మీ జీవితంలో మీరు ఏమి సాదించాలనుకుంటున్నారో మీకు  ఖచ్చితమయిన స్పష్టత లేకపోతే మీ ఆలోచనలు కార్యాచరణ రూపం దాల్చలేవు.

అప్పుడు సరైన గమ్యం(Goal) లేని ఒక గొప్ప ఆలోచన వృధా అయిపోతుంది, అది మీ జీవితానికి పెద్ద నిరుత్సాహాన్ని మిగులుస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

How to Set a GOAL in Telugu
How to Set a GOAL in Telugu

పక్కవారి గురించి పట్టించుకోకండి:

ఏదైనా కొత్త లక్ష్యం(Goal) కానీ, కొత్త ఆలోచన కానీ నాలుగు దశల గుండా వెళ్లాల్సి ఉంటుంది.

మొదటిగా దాన్ని ఎవరు పట్టించుకోరు,
తరువాత వెక్కిరిస్తారు,
ఆ తరువాత తీవ్రంగా ప్రతిఘటిస్తారు,
చివరిగా అది స్వయంసిద్ధమైనదని, మీ విజయానికి చప్పట్లు కొడతారు.

కాబట్టి, పక్క వారు ఏమనుకుంటారనో లేక నవ్వుతారనో, చిన్ని చిన్ని లక్ష్యాలను(Goal) ఏర్పరచుకోకండి.

లక్ష్య నిర్ణయంలో మరియు లక్ష్య సాధనలో ఇతరులు ఏమనుకుంటున్నారో అనే దాని మీద ద్రుష్టి కేంద్రేకరిస్తే మీకు మీరు అపకారం చేసుకున్నట్టే.

అభిరుచి:

మనకి ఇష్టమైన పనిని చేస్తున్నప్పుడు గంటలు కూడా క్షణాలలో గడిచిపోతాయి, నచ్చని పని చేస్తున్నప్పుడు క్షణాలు కూడా గంటలుగా గడుస్తున్నట్టు అనిపిస్తాయి. కాబట్టి మీ అభిరుచికి తగ్గట్టు మీకు ఆసక్తి గల రంగాలలో మీ లక్ష్యాన్ని(Goal) ఏర్పరచుకోండి.

బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలగడం:

బాగా సంతోషంగా ఉన్నప్పుడో లేక ఏదో బాధలో ఉన్నప్పుడో లక్ష్యాలను నిర్ణయించుకోవద్దు. ఎందుకంటే అది ఆవేశపు నిర్ణయం అనిపించుకుంటుంది. మనసు బాగున్నపుడు ఒక ప్రశాంతమయిన ప్రదేశంలో కూర్చుని ఒక పేపరు, పెన్ను తీసుకుని మీలో ఉన్న బలాలు, బలహీనతలు, మీకు ఉన్న అవకాశాలు మరియు సౌకర్యాలను రాసుకుని వాటిని బేరీజు చేసుకుని అప్పుడు మాత్రమే లక్ష్యాలను ఏర్పరచుకోవాలి.

How to set a Goal in Telugu
How to set a Goal in Telugu

మీ టాలెంట్ ని గుర్తించగలగడం:

చాలా మంది “మాలో ఉన్న టాలెంట్ ఏంటో మాకు తెలియదు” అని అనుకుంటూ ఉంటారు. దానికి ఒకటే గుర్తుపెట్టుకోండి.

“ఇతరులు ఏదైతే చేయడానికి బయపడి ముందుకు రాలేరో, మీరు ఆ పనిని అవలీల చేయగలరో అదే మీ టాలెంట్”. మీ టాలెంట్ గుర్తించాక దానికి తగ్గ రంగంలో మీ లక్యాన్ని(Goal) ఏర్పరచుకోవాలి.

మీ లక్ష్యం ద్వారా మీరు ప్రపంచానికి అందించేది అరుదుగా ఉండేట్టుగా , ఎక్కడా దొరకదు అనేట్టుగానూ చూసుకుంటే తక్షణం దాని విలువ పెరిగిపోతుంది.

ఈ విధంగా లక్ష్యాలను ఏర్పరచుకున్నాక ఏ 20% పని అయితే 80% ఫలితాన్ని ఇస్తుందో.. ఆ 20% పని మీద మీ దృష్టిని కేంద్రేకరించాలి. తద్వారా మీరు మీ గమ్యాన్ని(Goal) చాలా సులభంగా చేరుకోగలరు.

ఓర్పు:

చివరిగా మరియు ముఖ్యంగా లక్ష్య సాధనకు కావలసింది ఓర్పు.

మీరు ప్రత్యేకంగా ఒక లక్ష్యం పైనే గురిపెట్టాలి. కొన్ని సంవత్సరాల వరకు, లేదా కొని దశాబ్దాల పాటు. మీరు చేయాలనుకున్నది ఏమైనప్పటికీ ఒక క్రీడాకారుడు, ఒక గాయకుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రచయిత, లేదా ఒక వ్యాపారవేత్త ఏదీ కూడా రాత్రికి రాత్రే లేదా కొన్ని వారాలలో లేదా కొన్ని నెలలో విజయం దొరకదు. విజయ ఫలాన్ని పొందాలంటే ఓర్పు అనేది కూడా చాలా ముఖ్యం.

Work for a Goal with Patience
Work for a Goal with Patience

గమ్య సాధనకు సూత్రాలు:

*గమ్య సాధనకు మొదటిగా మనలోని అవలక్షణాలను, అసహనాన్ని విడవాలి. పోటీకి భయపడకూడదు. అలోచించి బరిలోకి దిగాలి, దిగితే అంతు చూడాలి.

*లక్ష్య సాధనలో మీ సామర్ధ్యం మేరకు మీరు ఎంత చేయగలరో, అంతా చేయండి. ఇతరులతో పోల్చుకుని బాధపడవద్దు.

*ఒక సామాన్య వ్యక్తి తనకున్న శక్తిలో కానీ సామర్ధ్యంలో కానీ 25% మాత్రమే తను చేసే పనిలో ఉపయోగిస్తాడు. ప్రపంచం 50% సామర్ధ్యాన్ని ఉపయోగించే వారిముందు తల వంచుతుంది. ఇక అరుదుగా 100% ఉపయోగించే అతి అరుదైన వారికోసం ప్రపంచం తలకిందులుగా నిలపడటానికైనా సిద్దమవుతుంది.

*కష్టపడనిదే ఏ పని నెరవేరదు, ఇష్టపడినంత మాత్రాన పనికాదు, కష్టపడాలి. సకాలంలో సరి అయిన పనిచేయడం తెలివికి తార్కాణం.

*తుప్పు పట్టిపోవడం కన్నా అరిగిపోవడం మంచిది అని తరచూ గుర్తుచేసుకుంటూ ఉండండి.

*ఏ పనైనా చేయగలడానికి కారణాలు వెతకండి కానీ, చేయలేకపోవడానికీ కాదు.

*ఒక పనిని చక్కగా చేయడానికి అనేక మార్గాలు ఉంటాయి. నిజానికి ఆ పని ఎంతమంది చేస్తారో, అన్ని మార్గాలు ఉంటాయి.

*ఆలోచించటం, అమలు జరపడం అనేది విజేతలు మొదటి రోజు నుంచే మొదలుపెడతారు. ఇతరులు ఎలా ప్లాన్ చేయలో అని ఆలోచిస్తూనే నెలలు గడిపేస్తారు.

చివరిగా సక్సెస్ అంటే..

* ఒక మనిషి హాయిగా, ఆనందంగా, తక్కువ సమస్యలతో, దగ్గిర వాళ్ళతో మంచి సంబంధాలతో, నలుగురి మధ్య మంచి పేరుతో, డబ్బుకి తడువుకోకుండా, ఉన్నంతలో యితరులకు సహాయం చేస్తూ, ఆరోగ్యం కాపాడుకుంటూ, తన సమయాన్ని తాను నిర్ధేశించుకోగలగే స్థాయిలో ప్రశాంతంగా ఉండగలగడం.

* తల్లితండ్రులు భుజం తట్టి ‘శభాష్ ఇంటి పేరు నిలబెట్టావు’ అనగలగడం.

* ఆటోగ్రాఫ్ లు తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదగ గలగడం.

You May Also Like:  Red bus సక్సెస్ స్టోరీ తెలుగులో

Ok ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ స్నేహితులందరితో షేర్ చేసుకోండి. పైవాటిలో మీకు నచ్చిన పాయింట్ ని కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి TeluguForbes ని రెగ్యులర్ గా Follow అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *