Paytm success story in Telugu_ success stories in telugu_stories in telugu_telugu forbes_inspirational stories_ telugu motivational stories_ telugu statup stories
Success Stories,  Uncategorized

Paytm Success Story in Telugu

Paytm
Paytm

 

‘ Paytm కరో ..’ ఈ స్లోగన్ విననివారు అంటూ ఎవరూ ఉండరు. పెద్ద నోట్ల రద్దు తరువాత బాగా పాపులర్ అయిన స్లోగన్ ఇది. ఇంత పేరు ప్రఖ్యాతులు పొందిన Paytm అసలు ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలయ్యింది? Paytm సక్సెస్ స్టోరీ ఏమిటి? Paytm ని ఎవరు స్థాపించారు? ఇలాంటి ఆసక్తికరమయిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Paytm ను విజయ్ శేఖర్ శర్మ అనే ఆయన స్థాపించారు. శర్మ జులై 8, 1978 వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లో గల అలీగర్హ్ అనే ప్రాంతంలో జన్మించారు.

Paytm Founder vijay-shekhar-sharma
Paytm Founder vijay-shekhar-sharma

ఇంటర్ వరకు హిందీ మీడియంలో చదువుకున్న శర్మ బీటెక్ కోసం ఢిల్లీలో గల ‘ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్’ కళాశాలలో జాయిన్ అయ్యారు. అప్పటివరకు అన్ని క్లాస్ లలో మొదటి స్టూడెంట్ గా రాణించిన ఆయనకు బీటెక్ బుక్స్ లోని ఇంగ్లీష్ మరియు ఇంగ్లీష్ లో లెక్చరర్లు చెప్పే పాఠాలేవీ అర్ధమయ్యేవి కావు. దీనితో ఎలాగయినా ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు.

దీనికోసం రోజూ లైబ్రరీకి వెళ్లి అక్కడ ఇంగ్లీష్ లో గల మోటివేషనల్ బుక్స్, సక్సెస్ స్టోరీస్ లను చదవడం మొదలుపెట్టాడు. ఈ పుస్తకాలు శర్మ జీవితాన్ని చాలా ప్రభావితం చేశాయి. ఏదోకటి సాధించాలి, ఏమైనా మొదలు పెట్టాలి అనే తపనని పుట్టించాయి.

ఇందులో భాగంగానే శర్మ కంప్యూటర్ క్లాసులకి వెళుతూ కోడింగ్ నేర్చుకున్నాడు. ఈ కోడింగ్ సహాయంతో 1997 లో తన స్నేహితుడితో కలిసి Indiasite.net అనే వెబ్సైటు ని మొదలుపెట్టాడు.

ఆ తరువాత 2001 లో శర్మ తన స్నేహితులతో కలిసి ఒక అద్దె ఇంటిలో 5 లక్షల పెట్టుబడితో ‘One 97 communications’ అనే కంపెనీని మొదలుపెట్టారు.

One 97
One 97

ఇది అప్పట్లో అందుబాటులో ఉన్న బేసిక్ మోడల్ ఫోన్ లకి రింగ్ టోన్స్, మెసేజ్ లు మరియు జోక్స్ పంపే సేవలను అందించేదిగా ఉండేది. కొన్ని కారణాల దృష్ట్యా ఈ సంస్థ కొద్ది కాలానికే నష్టాల బాట పట్టింది. అయితే తమ వద్ద ఉన్న పెట్టుబడి డబ్బులు కాస్తా అయిపోవడంతో బ్యాంకులో వడ్డీకి లోన్ తీసుకుని మరీ సంస్ధ ఉద్యోగులకు వేతనాలు చెల్లించారు శర్మ స్నేహితుల బృందం.

ఇలా కొద్ది కాలం గడిచిన తరువాత స్మార్ట్ ఫోన్ శకం స్టార్ట్ అయ్యింది. దీనిలో భాగంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో.. వినియోగదారులకు సేవలని అందించేలా 2010 ఆగస్ట్ లో ఢిల్లీకి చేరువలో గల నోయిడా పట్టణంలో Paytm సంస్థను స్థాపించాడు శర్మ.

Paytm Office
Paytm Office

2013 వ సంవత్సరంలో మొబైల్ రీఛార్జ్, DTH రీఛార్జ్, ల్యాండ్ లైన్ బిల్- పేమెంట్స్ లాంటి సేవలను అందించేదిగా Paytm తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

తరువాత 2014 వ సంవత్సరంలో రైల్వేస్ మరియు ఊబర్ సంస్థల యొక్క లావాదేవీలకు(Transcations) Paytm ను ఉపయోగించేలా సంబంధాలు ఏర్పరచుకుంది. దీనిలో భాగంగా లావాదేవీలను సులభతరం చేసేందుకు Paytm Wallet విధానాన్ని ప్రవేశపెట్టారు శర్మ. దీని ద్వారా మన బ్యాంకు ఎకౌంట్ నుంచి డైరెక్టుగా డబ్బులు వాలెట్ లోకి పంపుకుని వాటితో రైల్వేస్ మరియు ఊబర్ లకు పేమెంట్ చేసేలా ఏర్పాటు చేసారు.

2015 వ సంవత్సరంలో Paytm తన సేవలను మరింత విస్తృతపరచుకుంది. మెట్రో రీఛార్జ్ లు, కరెంటు బిల్, గ్యాస్ బిల్ మరియు వాటర్ బిల్ పేమెంట్ తదితర విభాగాలను అందుబాటులోనికి తీసుకువచ్చింది.

దీనితో Paytm వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరగసాగింది. 2014 లో 11.8 మిలియన్ ఉన్న వినియోగదారుల సంఖ్య 2015 కు 104 మిలియన్ కు చేరింది.

దీనితో 2016 వ సంవత్సరంలో ఫ్లైట్ టికెట్ బుకింగ్, మూవీస్, ఈవెంట్స్ మరియు Paytm QR లాంటి విధానాలను ప్రవేశపెట్టింది.

ఇలా అంచలంచలుగా ఎదుగుతున్న Paytm కు 2017 వ సంవత్సరం ఒక మైలు రాయి అని చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో  భారత దేశంలోనే మొట్టమొదటిగా 100 మిలియన్ డౌన్లోడ్స్ అయ్యిన యాప్ గా Paytm చరిత్రను సృష్టించింది.

Paytm Bank
Paytm Bank

ఈ సంవత్సరంలోనే Paytm Bank ని కూడా ఆవిష్కరించింది..ఈరోజు Paytm భారత దేశంలో గల 10 భాషలలో అందరికీ అందుబాటులో ఉంది. మొబైల్ రీఛార్జి నుంచి మాల్ షాపింగ్ వరకు అన్నిరకాల లావాదేవీలు Paytm లో చేసుకునేలా యాప్ ను తయారు చేశారు శర్మ.

ఏదైనా సాధించాలి అనే ఒక్క ఆలోచన.. ఇంత అద్భుతాన్ని సృష్టించింది. డిజిటల్ పేమెంట్ అంటే Paytm ఒక్కటే అనేలా సంస్థను మలిచిన విజయ్ శేఖర్ శర్మ యొక్క జీవితం మన అందరికీ ఎంతో ఆదర్శం.

You May Also Like: Redbus Success Story in Telugu

THANK YOU

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *