How Neurons transfer Information in Telugu_ How Neuros Works in Telugu TeluguForbes Science in Telugu
Science,  Uncategorized

How Neurons transfer Information | Explained in Telugu

మన శరీరంలోని ఒక భాగం నుండి మరొక భాగానికి సమాచారం ఎలా చేరవేయబడుతుంది?

మనం ఒక వస్తువుని చూసినప్పుడు లేదా వేడిగా ఉన్న వస్తువుని తాకినప్పుడు లేదా ఏదైనా రుచి చూసినప్పుడు లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు దానికి సంబంధించిన సమాచారం మెదడుకు ఎలా చేరుతుంది? న్యూరాన్లు(Neurons)ఎలా పని చేస్తాయి? మన శరీరంలోని సమాచార వ్యవస్థ నిర్మాణానికి సంబంధించిన ఆసక్తికరమయిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మన శరీరంలోని ట్రిలియన్ సంఖ్యలో న్యూరాన్లు(Neurons) అని పిలవబడే నాడీ కణాలు ఉంటాయి. ఒక్కొక్క న్యూరాన్ వేల కొలది న్యూరాన్లతో సంబంధం కలిగి ఉంటుంది. ఇవి శరీరంలోని ఒక భాగం నుండి మరొక భాగానికి సమాచారాన్నిచేరవేయడంలో దోహదపడతాయి.

Neurons
Neurons

ఉదాహరణకి మనం ఏదైనా వేడిగా ఉన్న వస్తువుని తాకినప్పుడు దానికి సంబంధించిన సిగ్నల్స్ చేతి నుండి ముందుగా వెన్నుపాముకు, అక్కడ నుండి మెదడుకి చేరతాయి. ఇప్పుడు మన మెదడు ఆ సిగ్నల్స్ ఏ భాగం నుండి వచ్చాయి?, ఇప్పుడు ఏమి చెయ్యాలో నిర్ణయించి.. ఏ కండరాలు కదలాలో ఆ కండరాలకు సిగ్నల్స్ పంపి.. మన చేతిని ఆ వేడి వస్తువు నుండి దూరంగా జరిగేలా చేస్తాయి.

Examples to Neuron Concept
Examples to Neuron Concept

మరి ఈ సమాచారం మెదడుకి ఎలా రవాణా చేయబడుతోంది?

Neuron parts
Neuron parts

మొదటిగా న్యూరాన్(Neurons) యొక్క డెండ్రాయిట్ లు సమాచారాన్ని గ్రహిస్తాయి. యాక్సాన్లు ఈ సమాచారాన్ని తరువాతి నాడీకణం యొక్క డెండ్రాయిట్లకు అందిస్తాయి. ఈ విధంగా సమాచారం ఒక నాడీకణం నుండి మరొక నాడీకణానికి ప్రసారం జరుగుతూ చివరికి గమ్య స్థానాన్ని చేరుకుంటాయి.

ఉదాహరణకు మనం కంటితో చూసే ఏదైనా వస్తువును చూసినప్పుడు ఆ వస్తువు యొక్క దృశ్యం మొదటిగా కంటిలోని రెటీనాపై పడుతుంది. రెటీనాలోని కణాలలో కొన్ని రసాయనిక చర్యలు జరిగి ఫలితంగా కొన్ని విద్యుత్ ప్రచోదనాలు ఉత్పన్నమవుతాయి. వీటినే ఎలక్ట్రిక్ ఇంపల్స్ లేదా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అని అంటాం.. ఈ ఎలక్ట్రిక్ ఇంపల్స్ న్యూరాన్ల ద్వారా ప్రయాణించి చివరిగా మెదడుని చేరుకుంటాయి. మీకు తెలుసా ఈ ఎలక్ట్రిక్ ఇంపల్స్ గంటకు 250 మైళ్ళ వేగంతో న్యూరాన్లలో ప్రయాణిస్తాయి.

Neurons Working
Neurons Working

ఒక న్యూరాన్ యొక్క నెర్వ్ టెర్మినల్స్, తరువాతి నాడీకణం యొక్క డెండ్రాయిట్స్ తో నేరుగా అతుక్కుని ఉండవు. ఈ రెండు నాడీకణాలకు మధ్య కొంచెం కాళీ అనేది ఉంటుంది. దీనినే సినాప్స్ అని అంటాం..

Neurons
Neurons
Synapse
Synapse

మరి నాడీకణాలు ఒకదానికొకటి డైరెక్ట్ గా అతుక్కుని ఉండకపోతే సమాచార ప్రసారం ఎలా జరుతుగుతోంది?

మనం పైన చెప్పుకున్నట్టుగా న్యూరాన్లలో(Neurons) ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ద్వారా సమాచారం చేరవేయబడుతుంది. ఇలా మొదటి న్యూరాన్ యొక్క యాక్సాన్ చివరి వరకు వచ్చిన ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఒక రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఈ రసాయనం సైనప్స్ ను ధాటి తరువాతి న్యూరాన్ యొక్క డెండ్రాయిట్ కు చేరుతుంది. ఇలా డెండ్రాయిట్ కు చేరిన రసాయనం తిరిగి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఇది అంతా సెకన్ల వ్యవధిలో జరిగిపోతుంది.

అంటే.. మన శరీరంలోని సమాచారం ఎలక్ట్రో-కెమికల్ సిగ్నల్స్ పద్దతిలో న్యూరాన్ల ద్వారా సమాచారం చేరవేయబడుతుంది అన్నమాట..

You May Also Like: How Human Brain Works? Explained in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *