భూమి మీద జీవనానికి సంబంధించిన కొన్ని రహస్యాలు మార్స్ గ్రహం మీద ఉన్నాయనేది కొంతమంది శాస్త్రవేత్తల భావన. అలాగే కొన్ని దశాబ్దాల తరువాత భూమి మీద నివసించే విధంగానే, మార్స్ గ్రహం మీద కూడా నివసించే అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళ వాదన.
దీనికోసం ‘మంగళయాన్’ (Mangalyaan)అనే ఉపగ్రహాన్ని మార్స్ గ్రహం మీదకు పంపారు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సిబ్బంది. స్పేస్ రీసెర్చ్ లో భారత్ సత్తా చాటిన ‘ప్రయోగం’ ఇది.
శ్రీహరికోట నుంచి రాకెట్ లాంచ్ ఆయినప్పటి నుంచి మార్స్ గ్రహాన్ని చేరుకునే వరకు మంగళయాన్(Mangalyaan) ప్రయాణం ఎలా సాగింది? ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఈ ఘనతని మంగళయాన్(Mangalyaan) సాధించింది? మంగళయాన్ ఎలా పనిచేస్తుంది? మార్స్ గ్రహం గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
అది నవంబర్ 5, 2013 శాస్త్రవేత్తలు రాకెట్ లాంచ్ చేయడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. టైమర్ పూర్తయ్యిన తరువాత రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

ప్రయోగ సమయంలో శ్రీహరికోట, పోర్ట్ బ్లెయిర్, బ్రునై, ఇండోనేషియా లలో ఉండే గ్రౌండ్ స్టేషన్లు రాకెట్ గమనాన్ని అనుసరించడంతోపాటు, సంబంధిత డాటాను మెషిన్ టీంకు అందజేస్తాయి.

అయితే రాకెట్ దక్షిణ పసిఫిక్ తీరం మీదకు చేరిన తరువాత ఈ గ్రౌండ్ స్టేషన్లు ఈ గమనాన్ని అనుసరించలేవు. అదే సమయంలో సంబందించిన సమాచారం లేకపోతే మెషిన్ టీం పనిచేయడం వీలుకాదు. ఈ సమస్యపై ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు మంగళయాన్ బృందం.
శక్తిమంతమైన యాంటీనాతో కూడిన రెండు నౌకలు పసిఫిక్ సముద్రం మీద ఉంటూ అక్కడ నుండి రాకెట్ గమన సమాచారాన్ని ప్రయోగ కేంద్రానికి పంపేలా ఏర్పాటు చేశారు.
శ్రీహరికోట, పోర్ట్ బ్లెయిర్, బ్రునై, ఇండోనేషియా స్టేషన్ల నుండి సంకేతాల ప్రకారం మొదటి మూడు ప్రయోగ దశలు విజయవంతమయ్యాయి.
తరువాత 26 నిముషాలు రాకెట్ లోని కీలకమైన దశ. ఆ సమయంలో రాకెట్ పసిఫిక్ మహా సముద్ర తీరంలో ప్రయాణిస్తుంది. అప్పుడు 10 నిమిషాల పాటు ఏ గ్రౌండ్ స్టేషన్ కు సమాచారం అందదు.
ఆసమయంలోనే కీలకమైన నాలుగో దశ ప్రారంభమవుతుంది. ఈ దశలో మంగళయాన్ లాంచ్ వెహికల్ నుండి విడువడి కక్ష్యలోనికి చేరుకుంటుంది.
ఈ దశలో కమ్యూనికేషన్ అనేది చాలా కీలకం. కమ్యూనికేషన్ కు సంబంధించి రెండు నౌకలదే కీలక పాత్ర. ప్రతీ అంశం అనుకున్నట్టే జరుగుతోంది అనే సంకేతం కోసం మంగళయాన్ బృందం ఆత్రుతతో చూస్తున్న ఘడియలవి.

రాకెట్ ఇంజిన్ లో ఇంధనం మండటాన్ని మొదటి నౌక యొక్క యాంటీనా గుర్తించింది. కొన్ని నిమిషాల తరువాత ఉపగ్రహం వేరు పడటాన్ని రెండో నౌక యొక్క యాంటీనా గుర్తించింది.
ఆ విధంగా మంగళయాన్ భూమి చుట్టూ ఉండే దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి చేరుకుంది. దీనితో మంగళయాన్ బృందంలో ఆనందం మిన్నంటింది.
ప్రయోగం విజయవంతమై తరువాత మంగళయాన్ ని భూమి చుట్టూ ఉండే దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరిగేలా చేశారు. తరువాత 25 రోజులలో ఇంజిన్ ని 6 సార్లు మండించడం ద్వారా దాని వేగాన్ని గరిష్ట స్థాయికి పెంచారు. తద్వారా భుయాకర్షణ నుండి బయట పడేందుకు కావలసిన శక్తిని మంగళయాన్ సాధించేలా చేశారు.

ఇప్పుడు మంగళయాన్(Mangalyaan) భూ కక్ష్య నుండి విడువడి మార్స్ దిశగా ప్రయాణమయ్యేందుకు సిద్ధమయ్యింది. ఇంజిన్ ని మండించడం ద్వారా వెంటనే మంగళయాన్ భూ కక్ష నుండి విడిపోయింది. మొట్టమొదటి ఇంటర్ ప్లానెట్ ప్రయోగంలో భాగంగా అది మార్స్ వైపు కదిలింది.
ఈ క్రమంలో మంగళయాన్ సెకనుకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. భూమి మీద కానీ మీరు ఆ వేగంతో ప్రయాణించగలిగితే కేవలం 9 నిమిషాలలో న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ కు చేరుకోవచ్చు. అంటే మార్స్ దిశగా మంగళయాన్ ఎంత వేగంతో వెళుతుందో మీరే అర్ధం చేసుకోవచ్చు.
భూ కక్షను వదిలిన తరువాత మార్స్ వైపు మంగళయాన్(Mangalyaan) ప్రయాణం దాదాపుగా అప్రయత్నంగా జరిగిపోతుంది. ముందుగా దాని ఇంజిన్ ఆగిపోతుంది. ఇలా ఆగిపోయిన ఇంజిన్ 316 ల రోజుల తరువాత అంటే.. మంగళయాన్, మార్స్ గ్రహం మీద అడుగుపెట్టాకా ఆన్ అవుతుంది.
ఆ తరువాత అది మార్స్ కక్షలోనికి ప్రవేశిస్తుంది. ఆ మార్స్ గ్రహానికి 500 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండే స్థాయిలో అది ఆ కక్ష్యలో ప్రవేశిస్తుంది.
ఈ విధంగా మంగళయాన్ కొద్ది రోజుల ప్రయాణం తరువాత మార్స్ గ్రహం మీదకు అడుగు పెట్టింది. ఇక్కడే అసలైన సమస్యను మంగళయాన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు శాత్రవేత్తలు ఎదుర్కొన్న సవాళ్లు ఒక ఎత్తయితే ఈ సవాలు ఒక ఎత్తు. అదేమిటంటే మంగళయాన్ మార్స్ కక్ష్యలోకి ప్రవేశించిన సమయంలో అది మార్స్ గ్రహానికి వెనుక వైపుకి వెళుతుంది. ఆ సమయంలో భూమితోను, మెషిన్ టీం తోనూ.. దానికి ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. అంటే మంగళయాన్ ముందుగా నిర్ధేశించిన ఆదేశాల ప్రకారం తనకు తానుగా ఇక్కడ పనిచేయాల్సి ఉంటుంది..అలా గ్రహణం లాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయిన మంగళయాన్ నుంచి భూమికి సిగ్నల్స్ రావు.

ఆ సమయంలో బెంగుళూరులోని శాస్త్రవేత్తలు అంతా చాలా ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సమయమది. మెషిన్ రూమ్ లో సూదిపడినా వినపడేంత నిశ్శబ్ధత చోటు చేసుకుంది.
500 మంది శాస్త్రవేత్తల శ్రమ, సంవత్సరాల కష్టం, మరియు భారత దేశం యొక్క గౌరవం ఈ మెషిన్ ఫలితం మీదే ఆధారపడి ఉండటంతో అందరూ.. ఉత్కంఠతో మంగళయాన్ కక్షలోనే ఉండి సిగ్నల్స్ ఇచ్చి భారత్ కి సక్సెస్ అందిస్తుందా, లేక కక్ష ధాటి అడ్రెస్స్ లేకుండా పోతుందా అనే ఆలోచనలో పడ్డారు.
దాదాపుగా 25 నిమిషాల ఉత్కంఠ తరువాత మంగళయాన్ నుండి మొదటి సందేశం వచ్చింది. అది విజయవంతంగా మార్స్ కక్ష్యలోకి ప్రవేశించిందని.
ఇక మంగళయాన్ తన కెమెరాతో అరుదైన, ఆశ్చర్యకరమైన చిత్రాలను భూమికి పంపింది.
మార్స్ పైకి విజయవంతంగా మెషిన్ ను పంపిన 4వ ప్రపంచ దేశంగానూ, అతి తక్కువ బడ్జెట్ తో మెషిన్ ని పంపిన దేశంగానూ, మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించిన తొలి దేశంగానూ భారత అంతరిక్ష సంస్థ ఘనత దక్కించుకుంది. చివరిగా మంగళయాన్ అరుణ గ్రహం మనం చేరుకోలేనిది కాదని అది నిరూపించుకుంది.
Working of Mangalyaan (మంగళయాన్ పనితీరు):
మంగళయాన్ రూపం ఒక చిన్న స్థూపంల ఉంటుంది. ఆకారంతో పోలిస్తే చిన్న సైజు ఆటో కంటే చిన్నది. మంగళయాన్ మెదడు ఒక అత్యున్నత స్థాయి మేధో వ్యవస్థ. లక్షల కిలోమీటర్ల అవతల నుండి కూడా మెషిన్ టీంతో సంబంధాలు నడపడానికి అది ఉపయోగపడుతుంది. మంగళయాన్ లోని సోలార్ పానెల్స్ దాని మెదడుకి శక్తిని అందిస్తాయి. అయినప్పటికీ బ్యాకప్ కోసం అందులో లిథియమ్ అయాన్ బ్యాటరీని కూడా అమర్చారు. మంగళయాన్ కి అమర్చిన అత్యంత శక్తివంతమైన యాంటీనా భూమి దిశగా ఉంటూ సందేశాలను పంపడానికి, అందుకోవడానికి ఉపయోగపడుతుంది.

కేవలం 15 నెలలలో మంగళయాన్ ని తయారు చేశారు. అది కూడా కేవలం 74 మిలియన్ డాలర్ల(450 కోట్లు) వ్యయంతో .. అదే సమయంలో అమెరికా సొంతంగా ‘మావెన్’ అనే మార్స్ మెషిన్ ను ప్రయోగించింది. దీనికోసం నాసా 670 మిలియన్ డాలర్లని వెచ్చించింది. ‘మావెన్’ తో పోలిస్తే ‘మంగళయాన్’ ని భారత్ చాలా తక్కువ ఖర్చుతోనే తయారు చేసిందని చెప్పొచ్చు.
మార్స్ గ్రహం గురించిన ఆసక్తికరమైన విషయాలు:
చాలా విషయాలలో మార్స్ గ్రహం భూమిని పోలినట్టు ఉంటుంది.
1. మార్స్ ఉపరితలం చాలా వరకు భూమిలానే ఉంటుంది.
2. మార్స్ గ్రహం మీద ఒక రోజు అనేది 24 గంటల కన్నా కొంచెం ఎక్కువ.
3. మార్స్ మీద ఒక ఏడాది భూమి మీద 2 సంవత్సరాలతో సమానం.
4. మార్స్ మీద బరువు భూమితో పోలిస్తే 1/3 వ వంతు ఉంటుంది. అంటే ఒక వస్తువు భూమి మీద 100 కేజీలు
ఉంది అనుకుంటే మార్స్ గ్రహం మీద 37 కేజీలు మాత్రమే ఉంటుందన్నమాట.
5. భూ గ్రహం మాదిరిగానే మార్స్ గ్రహం మీద కూడా అగ్ని పర్వతాలు, లోయలు, మంచు ధ్రువాలు ఉన్నాయి.
You May Also Like: Big bang Theory అంటే ఏమిటి? ఈ విశ్వం ఎలా పుట్టింది?
THANK YOU