How Internet Works in Telugu
Technology,  Uncategorized

How Internet Works in Telugu

ఈరోజుల్లో Internet అనేది మన  రోజువారీ జీవితాలలో ఒక భాగమైపోయింది. పాత రోజులలో మనకి ఏదైనా information కావాలి అంటే పుస్తకాలనో లేదా ఎవరైనా నిష్ణాతులనో ఆశ్రయించవలసి వచ్చేది. కానీ ఈరోజుల్లో మనకి ఏమి సమాచారం కావాలన్నా అందరికి గుర్తొచ్చే ఒకే ఒక్క Source ఇంటర్నెట్.

ఎలాంటి సమాచారాన్ని అవతల వ్యక్తికి చేరవేయాలన్నా లేక మనకి కావలసిన సమాచారాన్ని తెలుసుకోవాలన్నా అందరం Interenet నే ఆశ్రయిస్తున్నాం. ఇంటర్నెట్ ఉపయోగించే మెసేజ్ లు పంపుతున్నాము, ఇమెయిల్, ఫొటోస్, డేటా ఇలా వేటికన్నా ఇంటర్నెట్ నే ఒక మాధ్యమంగా వాడుతున్నాం. Internet లేకుండా ఒక రోజు గడపడం అంటే ఈరోజుల్లో అసాధ్యమనే చెప్పొచ్చు.

అలాంటి Internet ఎలా పనిచేస్తుంది? మనం పంపిన మెసేజ్ లు గాని, మెయిల్స్ కానీ వేరే దేశంలో ఉన్న వాళ్లకి సైతం క్షణాలలో ఎలా చేరుకుంటున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం…

పూర్వం ఒకరి నుంచి ఒకరికి క్షేమ సమాచారం తెలియాలి అంటే ఉత్తరాల ద్వారా పంపేవారు. మనం అవతల వ్యక్తికి ఉత్తరం పంపాలి అంటే అవతల వ్యక్తి అడ్రెస్స్ అనేది మనకి తెలియాలి. ఇక్కడ పోస్ట్ కార్డు ని మాధ్యమంగా ఉపగించెవారు.

అదే విధంగా ఒక కంప్యూటర్ లేదా ఫోన్ ద్వారా వేరే కంప్యూటర్ కి సమాచారాన్ని పంపాలి అంటే అవతల కంప్యూటర్ యొక్క అడ్రెస్స్ అనేది మనకి తెలియాలి.  దీనినే మనం I.P Adress అని అంటాం. ప్రతి కంప్యూటర్ కి లేదా ఫోన్ కి ఒక Unique I.P Adress(IP-Internet Proocol) అనేది ఉంటుంది.

ఇంటర్నెట్ అనేది ప్రోటోకాల్స్ ఆధారితంగా పనిచేస్తుంది. ఈ ప్రోటోకాల్స్ అనేవి వరుసక్రమంలో సూచనలను కలిగి ఉంటాయి. ఈ సూచనలను అనుసరించే డేటా అనేది ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్ కి పంపబడుతుంది.

అయితే ఈ ప్రోటోకాల్స్ లో కూడా వివిధ రకాలు ఉన్నాయి. కంప్యూటర్ తో మనకి ఉన్న అవసరాన్ని బట్టి దానికి తగ్గ ప్రోటోకాల్ మనకి సహాయం చేసిపెడుతుంది.

ఉదాహరణకి 1.2.3.4 అను I.P adress కలిగిన మన కంప్యూటర్ నుంచి 5.6.7.8 I.P adress కలిగిన వేరొక కంప్యూటర్ కు “Hello Computer” అని మెసేజ్ పంపాము అనుకుందాం…

Internet Working
Internet Working

1. మొదట ఈ మెసేజ్ అనేది Application Protocol ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. www, e-mail, FTP(File tranfer protocol) మొదలగు వాటిని Application Protocols అని అంటాము.
మనకి సమాచారం పంపాలి అంటే e-mail, ఏదైనా ఫైల్స్ పంపాలంటే File tranfer protocol, అదే మనకి ఏదైనా సమాచారం కావాలంటే… ఉదారణకి TeluguForbes అని గూగుల్ లో సెర్చ్ చేయాల్సి వస్తే ఈ పేరు మీద ఉన్న ఫైల్స్ ను మన ముందు ఉంచడానికి www ఉపయోగపడతాయి.

2. మనం పంపిన మెసేజ్ ను కంప్యూటర్ చిన్ని చిన్ని భాగాలుగా విభజించుకుంటుంది. ఈ చిన్ని చిన్ని భాగాలనే ప్యాకెట్స్(packets) అని అంటాము.

3. ఈ ప్యాకెట్స్ అనేవి Application Protocol ద్వారా TCP (Transmission Control Protocol) కి పంపబడతాయి. . ఇక్కడ ప్రతీ ప్యాకెట్ కు ఒక్కో Port Number అనేది కేటాయించబడుతుంది. ఈ Port Number అనేది ప్యాకెట్స్ ను ఒక వరుసక్రమంలో పంపడానికి సహాయపడతాయి.

4. ఇలా కేటాయించబడిన గల నంబర్లు ప్యాకెట్లు I.P stage కి పంపబడతాయి. ఇక్కడ మనం ఎవరికైతే మెసేజ్ పంపుదాం అనుకుంటున్నామో 5.6.7.8 వాళ్ళ I.P Adress అనేది ఇక్కడ నమోదై ఉంటుంది.

5. ఇప్పుడు నంబర్లు కేటాయించబడిన ప్యాకెట్లు I.P Adress 5.6.7.8 కు ఇంటర్నెట్ ద్వారా… అంటే మన కంప్యూటర్ కు కనెక్ట్ చేయబడి ఉన్న వైర్ కనెక్షన్(Hardware) లేదా వైఫై రౌటర్ కి పంపబడుతుంది.

6. ఇక్కడ మనం పంపిన Alphabet మెసేజ్ అనేది విద్యుదయస్కాంత సంకేతాలు(electromagnetic signals) గా మార్చబడి ఫోన్ లైన్ ల(Hardware) ద్వారా అవతల కంప్యూటర్ కి పంపబడుతుంది.

7. ఇలా 5.6.7.8 I.P Adress గల కంప్యూటర్ కు మెసేజ్ అనేది చేరుతుంది.

8. ఇక్కడ నుండి ప్రాసెస్ అనేది క్రింది నుండి మొదలవుతుంది.

9. విద్యుదయస్కాంత సంకేతాలుగా పంపబడిన మెసేజ్ internet cable(Hardware) ద్వారా మన కంప్యూటర్ ని చేరుతాయి.

10. ఇక్కడ విద్యుదయస్కాంత సంకేతాలు(electromagnetic signals) Alphabet గా మారి, నంబర్లు కేటాయించబడిన ప్యాకెట్లుగా తర్జుమా చేయబడతాయి.

11. చివరిగా వాటి నంబర్ల యొక్క వరుసని అనుసరించి చిన్న చిన్నగా విభజించబడిన మెసేజ్ అమర్చబడి “Hello Computer” గా మన కంప్యూటర్ లో కనిపిస్తుంది.

ఈ process అంతా క్షణాలలో జరిగిపోతుంది. ఏది ఏమైనా మనం బయటకి వెళ్లకుండా ఇంటిదగ్గరే ఉండి అన్ని పనులు చేసుకునేలాగా, కొత్త మందికి సంపాదన తెచ్చేదిగా, కొంత మందికి Information ని ఇచ్చేదిగా, మరి కొంత మందికి వినోదాన్ని పంచేదిగా ఉన్న ఇంటర్నెట్ కి మనం THANKS చెప్పుకోక తప్పదు.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *