Facts-about-salary-in-Telugu-TeluguForbes
Life Style,  Uncategorized

Interesting Facts About ‘Salary’

 

భూమి ఇప్పటికంటే ముప్పైరెట్లు వేగంగా తిరిగిందనుకో  ఏం జరుగుతుంది? అని ఇంటర్వ్యూ చేస్తున్న పెద్ద మనిషి అడిగాడు.

‘ఇంకేముంది సార్! రోజూ జీతం(Salary) వచ్చేస్తుంది!’ అని జవాబిచ్చాడు ఇంటర్వ్యూకి  వచ్చిన వ్యక్తి.

నిజమే, జీతమిచ్చే కిక్కే వేరు..

ఉద్యోగం  అనేది ఫలానా మొత్తాన్ని జీతంగా ఇస్తున్నందుకు గానూ, ఫలానా సేవల్ని అందించాలంటూ ఉద్యోగీ యజమానీ చేసుకునే ఒక ఒప్పందం. జీతం రూపంలో అందుతున్న మొత్తం, పని రూపంలో ధారపోస్తున్న నైపుణ్యం … సమాన స్థాయిలో ఉన్నంత వరకూ ఎవరికీ ఇబ్బంది ఉండదు. జీతం ఎక్కువై, శ్రమ తగ్గినప్పుడు యాజమాన్యం అసంతృప్తికి లోనవుతుంది, జీతం తగ్గి శ్రమ పెరిగితే ఉద్యోగిలో అసంతృప్తి రగులుతుంది.

Telugu Forbes-Facts-in-Telugu
Interesting Facts about ‘Salary’

ఏ ఉద్యోగంలో అయినా ఏడాదికి పది నుంచి పదిహేను శాతానికి మించి పెరుగుదల ఆశించడం దురాశే. జీతం పెరుగుతున్నకొద్దీ, ఉద్యోగి మీద అంచనాలూ పెరుగుతాయి. దాన్ని నిలబెట్టుకోవడం కత్తిమీద సాము వంటిదే.. తేడావస్తే…పరమపద సోపానంలో పామునోట్లో చిక్కుకున్నట్టే. శాశ్వతంగా వదిలించుకునే ప్రయత్నమూ మొదలవుతుంది.

కెరీర్ విజయాన్ని కేవలం సంపాదనతో ముడిపెట్టుకున్నా ప్రమాదమే. అత్యధికంగా జీతం అందుకుంటున్నవాళ్లే అత్యంత సంతోషంగా ఉంటారనుకుంటే పొరపాటే. ఆత్మసంతృప్తి, గుర్తింపు కూడా జీవితంలో జీతమంత ముఖ్య విషయాలే..

ఏది ఏమైనప్పటికీ  ప్రపంచంలో రెండే రెండు మెసేజీలు మనకి మహా ఆనందాన్ని ఇస్తాయి. ఒకటి… ఐ లవ్ యు, రెండు… యువర్ శాలరీ ఈజ్ క్రెడిటెడ్!

You May Also Like: Tips to Young Age People in Telugu

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *