How Human Brain Works in Telugu
Science,  Uncategorized

How Human Brain Works? Explained in Telugu

మనిషి ఆదిమానవుడిగా కనీసం బట్టలు కూడా కప్పుకోవడం తెలియని స్థాయి నుండి మరో మర మనిషిని తయారు చేయగలిగినంత గొప్ప స్థాయికి ఎదిగాడు అంటే అది కేవలం ఎక్కడో మెదడులో(Brain) ఒక మూల పుట్టిన ఆలోచన యొక్క ఫలితమే.

మనం ఈరోజు గాలిలో ప్రయాణం చేస్తున్నామన్నా, స్మార్ట్ ఫోన్ ని వాడుతున్నా, ఇంటర్నెట్ ని వాడుతున్నా, ఒక భవనంలో ఏసీ గదిలో కుర్చున్నా… ఇవన్నీ ఎవరోకరి మెదడులోని పుట్టిన ఆలోచనల యొక్క ప్రతిరూపాలే..

మనిషి మామోలు స్థాయి నుంచి మోడరన్ స్థాయి ఎదగడానికి గల కారణం కేవలం అతడి మెదడు(Brain) మాత్రమే..

అలాంటి మెదడు(Brain) ఎలా పనిచేస్తుంది? దానికి ఉన్న శక్తి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

మన మెదడు రెండు విడి విడి భాగాలుగా ఉంటుంది. ఇందులో మెదడులోని కుడి వైపు భాగం మన శరీరంలోని ఎడమవైపు భాగంలోని అవయవాలను… మెదడులోని ఎడమవైపు భాగం మన శరీరంలోని కుడివైపు శరీరభాగాలనూ కంట్రోల్ చేస్తాయి.

Brain Working| Explained in Telugu
Brain Working| Explained in Telugu

మన Brain లో Consious Mind మరియు Subconcious Mind అని రెండు రకాలు ఉంటాయి.

ఇందులో Consious Mind లో చూడటం, మాట్లాడటం, వినడం, కదలడం వంటి పనులు అన్నీ… మనకి తెలుస్తూనే జరుగుతూ ఉంటాయి.

కానీ SubConsious Mind లో మాత్రం మన ప్రమేయం లేకుండా చాలా పనులు జరుగుతూ ఉంటాయి.ఉదాహరణకి రక్త ప్రసరణ, శ్వాస తీసుకోవడం, తిన్న ఆహారం జీర్ణమవ్వడం, శరీరం యొక్క ఉష్ణోగ్రతను ఆధీనంలో ఉంచడం, ఇలా… శరీరంలోని అవయవాలన్నీ సరిగ్గా పనిచేసేలా SubConsious Mind రెగ్యులేట్ చేస్తుంటుంది.

ఇప్పుడు మెదడులోని ఏ భాగం దేనికి భాద్యత వహిస్తూంటుందో చూద్దాం…

Brain Working in Telugu
Brain Working in Telugu
Human Brain Working
Human Brain Working

1. Frontal lobe అనే భాగం ఏదైనా సమస్య వస్తే దానియొక్క పరిష్కారానికి మార్గాలను అందివ్వడంలోను మరియు ఆలోచనలని అందించే విషయాలలోనూ బాధ్యత వహిస్తూ ఉంటుంది.

2. Parietal lobe అనేది స్పర్శ మరియు రుచిలను తెలియచేస్తుంది.

3. occipital lobe అనేది మనం చూసిన వాటిని అన్నిటిని Images రూపంలో మన మెదడులో Store చేయడానికి సహాయపడుతుంది.

4. The temporal lobe అనేది వాసన, రుచి, ధ్వని వాటిని మనకు తెలిసేలా చేస్తుంది మరియు ఇది కూడా ఒక Store లా పనిచేస్తుంది.

5. Hypothalamus అనేది మన యొక్క Emotions ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మరియు మన శరీరం యొక్క Temperatureను ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది.

మన మెదడులో సుమారుగా 100 బిలియన్ సంఖ్యలో న్యూరాన్లు అని పిలవబడే కణాలు ఉంటాయి. ప్రతీ న్యూరాన్ కూడా మరో 1000 కి పైగా న్యూరాన్లతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. మన శరీరానికి కావలసిన సమాచారం సిగ్నల్స్ రూపంలో ఒక న్యూరాన్ నుండి మరో న్యూరాన్ కు బదిలీ అవుతూ ఉంటుంది.

Neurons in Human Brain
Neurons in Human Brain

ఉదాహరణకి మన చెయ్యి ఏదైనా వేడి వస్తువుని తాకింది అనుకుందాం.. మనం వెంటనే మన చేతిని వెనక్కి తీసేస్తాం..

అంటే మన చేతికి సమీపంలో ఉన్న న్యూరాన్ల ద్వారా ఈ సమాచారం మెదడుకి చేరి, Parietal lobe రెస్పాండ్ అవ్వడం వల్ల స్పర్శ అనేది తెలిసి మనం వేడిగా ఉన్న వస్తువుని తాకాము అని మనకి అర్ధమవుతుంది. దీనికి Concious Mind, Alert Message ను రిలీజ్ చేస్తుంది. దీనికి respond అయిన Frontal lobe, Safety Alert గా ‘చేతిని వెనక్కి తీసెయ్యమని’ మెసేజ్ ని రిలీజ్ చేస్తుంది . ఇప్పుడు ఈ సమాచారం న్యూరాన్ల ద్వారా మన చేతికి చేరి మనం చేతిని వెనక్కి తీసేస్తాం…

ఈ ప్రక్రియ అంతా జరగడానికి పట్టే సమయం సెకను కన్నా తక్కువే…

సాధారణంగా మన అందరిలో మనం మనకున్న బ్రెయిన్ లో 10% మాత్రమే వాడుతున్నాం.. మిగిలింది అంతా మొద్దుబారిపోయి ఉంటుంది అనే అపోహ ఉంటూ ఉంటుంది. అది తప్పు.

ఎందుకంటే మన మెదడులోకి ఒక్కో భాగం.. శరీరంలోని ఒక్కో భాగాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. మన శరీరంలోని అన్ని భాగాలు సరిగ్గా పనిచేస్తున్నాయి అంటే దాని అర్ధం మన మెదడు కూడా 100% పని చేస్తోందనే …

మన మెదడు సెకనుకు 38,000 ట్రిలియన్ ఆపరేషన్స్ ను చేస్తుందట. ప్రపంచంలోనే super computer అయినటువంటి Blue Gene కంప్యూటర్, సెకనుకు మన బ్రెయిన్ చేసే పనిలో 0.002% మాత్రమే చేయగలదు.

K Computer
K Computer
Blue Gene Computer
Blue Gene Computer

అలాగే ప్రపంచంలోనే నాలుగవ super computer అయిన ‘K Computer’ కు మన బ్రెయిన్ సెకను కాలంలో చేసిన పనులని చేయడానికి 84,944 ప్రొసెసర్లు అవసరమయ్యాయి. అయినా కూడా… మన బ్రెయిన్ ఒక సెకనులో చేసే పనిని చేయడానికి ‘K Computer’ కు 40 నిమిషాలు పట్టింది.

దీనిని బట్టి మన బ్రెయిన్ కి ఉన్న శక్తి ఎంతటిదో, మన బ్రెయిన్ ఎంత పవర్ ఫుల్ నో మీకు అర్ధమయ్యే ఉంటుంది.

You May Also Like: Bigbang Theory అంటే ఏమిటి? ఈ విశ్వం ఎలా పుట్టింది?

 

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *