What would happen if gravity stopped working
Science,  Uncategorized

what would happen if gravity stopped working in Telugu

Gravity లేదా గురుత్వాకర్షణ అనగానే మనకి గుర్తొచ్చేది స్కూల్ రోజుల్లో సైన్స్ టీచర్లు చెప్పిన కథ. న్యూటన్ అన్నవాడు ఆపిల్ చెట్టు కింద కూర్చోవడం, ఆపిల్ చెట్టు నుండి ఆపిల్ కిందకి రాలడం, అది కిందకే ఎందుకు రాలాలి పైకి ఎందుకు వెళ్లిపోకూడదు? అంటే ఏదో శక్తి దీనికి కారణమవుతోందని ఆ శక్తి పేరు గురుత్వాకర్షణ శక్తి అని న్యూటన్ కనిపెట్టడం.
సైన్స్ అంటే ఇష్టం లేనివారు న్యూటన్ కూర్చోక కూర్చోక ఆ సమయంలోనే కూర్చోవాలా? కూర్చుంటే కూర్చున్నాడు ఆ సమయంలోనే ఆపిల్ కిందకి పడాలా ? పడితే పడింది దొరికింది తిని వెళ్ళిపోచ్చు గా మనకి ఈ సైన్స్ బాధ తప్పేది అని చాలా బాధపడుతూ ఉంటారు.

కానీ ఆ గురుత్వాకర్షణ శక్తి అనేదే లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో దాని యొక్క విలువ ఎంతటిదో ఇది చదివిన తరువాత అర్ధమవుతుంది.

1. Gravity లేకపోతే జరిగే మొట్టమొదటిది సంఘటన ఏమిటంటే భూమిని ఆధారం చేసుకుని నిలపడినవేవి భూమి మీద ఉండవు. భూమి
నుంచి దూరంగా విసిరివేయబడతాయి. అది మనం కూడా.

2. భూమి యొక్క వాతావరణం మరియు దాని మహాసముద్రాలు, నదులు మరియు సరస్సులు అన్నీకూడా అంతరిక్షంలోకి విసిరివేయబడతాయి.

3. భూమి సైతం భాగాలుగా విభజించబడి అంతరిక్షంలో తేలుతూ ఉంటుంది.

4. చివరికి అంతరిక్షంలో ఎక్కడా నక్షత్రాలు లేదా గ్రహాల వంటివి ఏమీ ఉండవు.

5. ఇవేమి లేకుండా చదవడానికి మీరు, రాయడానికి నేను కూడా ఉండము.

6. మనం అంతా చనిపోతాం అని వేరేగా చెప్పనవసరం లేదు.

Astronauts Experiment on Zero Gravity
Astronauts Experiment on Zero Gravity

Jay Buckey అనే శాస్త్రవేత్త గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల (ఒకవేళ బ్రతికి ఉంటే) మానవ శరీరం ఎలా ప్రభావితం అవుతుంది అన్నదాని మీద పరిశోధనలు చేశారు.

అయన పరిశోధనలలో తేలిందేంటంటే…

1. గురుత్వాకర్షణ లేకపోతే మనం గాలిలో తేలుతూ ఉంటాం

2. Gravity లేకపోతే మనలోని ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గిపోయి అది రక్తహీనతకు దారితీస్తుంది.

3. శ్వాస తీసుకోవటానికి ఎక్కువ సమయం పడుతుంది మరియు రోగనిరోధక వ్యవస్థ అనేది సరిగ్గా పనిచేయదు.

4. ఎముకలలోని బలం మరియు బరువు తగ్గిపోతుంది. వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన తరువాత బరువు తగ్గిపోయి ఉండటమే దీనికి ప్రత్యేక నిదర్శనం.

4. గురుత్వాకర్షణకు మన శరీరాలు అలవాటు పడిపోయిన కారణంగా గురుత్వాకర్షణ లేకపోతే మన శరీరంలోని అవయవాల పెరుగుదల అనేది సవ్యంగా ఒక పద్దతిలో కాకుండా వివిధ మార్గాలలో అభివృద్ధి చెందుతాయి.

ఇన్ని విధాలుగా మనకు తెలియకుండానే మనకెంతో సాయం చేస్తోంది Gravitational Force.

 

You May Also like: Fingerprints ఎలా ఏర్పడతాయి?  ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఎందుకు ఉండవు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *