Success Stories,  Uncategorized

Google Success Story in Telugu – Sunday Special

ఈ రోజుల్లో మనకి ఏమి సమాచారం కావాలన్నా అందకి గుర్తొచ్చే ఒకే ఒక్క అప్లికేషన్ గూగుల్(Google). మనం ఎలాంటి సమాచారాన్ని సెర్చ్ చేయాలన్నా గూగుల్ తల్లినే అడుగుతున్నాం..

గూగుల్ లేకుండా ‘ఇంటర్నెట్’ అనేది ఊహకి కూడా చిక్కని ప్రశ్న.. అలాంటి గూగుల్(Google), ఒక సాధారణ సంస్థగా ప్రారంభమయ్యి.. అసాధారణమైన ఏకైక సెర్చ్ ఇంజిన్ గా ఎలా ఎదిగింది? గూగుల్ యొక్క సక్సెస్ స్టోరీ ఏమిటి? (Google Success Story in Telugu), గూగుల్ పేరులోని అర్ధం ఏమిటి?, గూగుల్ ని ఎవరు స్థాపించారు? ఇలాంటి ఆసక్తికరమయిన విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్(Google) సంస్థను లారీ పేజ్ మరియు సర్జీ బ్రిన్ అనే ఇద్దరు స్నేహితులు కలిసి స్థాపించారు. వీరివురు మొట్ట మొదటిసారిగా 1995 మార్చి లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో కలుసుకున్నారు. అప్పటికే రెండు సంవత్సరాలుగా చదువుతున్న బ్రిన్ కొత్త విద్యార్థులకు కాలేజీ క్యాంపస్ ను చూపించడానికి నియమించబడ్డాడు. ఆ కొత్త విద్యార్థులలో పేజ్ కూడా ఉన్నాడు. కంప్యూటర్ పై ఉన్న అమితమైన ఆసక్తి, ఇద్దరినీ మంచి స్నేహితులని చేసింది. కొద్ది నెలల ప్రయాణం తరువాత వీరు ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దామని అనుకుంటారు.

Google Founders Sergey Brin and Larry Page (From Right Side)
Google Founders Sergey Brin and Larry Page (From Right Side)

PhD లోని ప్రాజెక్ట్ లో భాగంగా.. వరల్డ్ వైడ్ వెబ్(www) యొక్క నిర్మాణ ప్రక్రియను అర్ధం చేసుకుంటూ.. బ్యాక్ లింక్స్ ఆధారంగా వెబ్సైట్ల యొక్క ర్యాంకింగ్ లు ఇచ్చే ఒక కొత్త సాఫ్ట్ వేర్ (Website Ranking Software)ను కనిపెట్టాలనేది వీరి ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశ్యం.

(బ్యాక్ లింక్ అంటే ఏమిటి: మీరు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ యొక్క లింక్ మీద క్లిక్ చేసి Telugu Forbes వెబ్సైటుకి వచ్చారు అనుకుందాం. నేను వేరోక వెబ్సైటు యొక్క లింక్ ను ఈ పోస్ట్ కింద పెడితే.. ఆ వెబ్సైటు కు ఇది ఒక బ్యాక్ లింక్ అవుతుందన్నమాట)

సరే విషయంలోనికి వెళితే ..వీరి ప్రాజెక్ట్ కు “బ్యాక్‌రబ్” అని పేరు పెట్టారు. దీనిలో భాగంగా బ్రిన్ మరియు పేజ్ లు కలిసి ర్యాంకింగ్ అల్గారిధాన్ని(Ranking Algorithm) రూపొందించారు. దీనిని తయారుచేస్తున్న సమయంలో.. అప్పట్లో ఉన్న సెర్చ్ ఇంజన్ల కన్నా మెరుగైన సెర్చ్ ఇంజన్ ను తాము తయారు చేస్తున్నాము అన్న ధీమా వారికి కలిగింది.

BackRub
BackRub

ఈ సెర్చ్ ఇంజిన్ అనేది బ్యాక్ లింక్ ల ఆధారంగా ఇంటర్నెట్ లో గల వెబ్సైట్ల ర్యాంకింగ్ ని నిర్ధారించేదిగా ఉండేది.

ఉదాహరణకు Telugu Forbes వెబ్సైటు యొక్క లింక్ ఎన్ని ఎక్కువ వెబ్సైట్లలో ఉంటే..Telugu Forbes యొక్క ర్యాంకింగ్ అంత ఎక్కువగా “బ్యాక్‌రబ్” లో చూపించేది అన్నమాట.

ఈ విధంగా బ్యాక్‌రబ్ అని పిలువబడే గూగుల్ యొక్క తొలి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది అప్పట్లో కేవలం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో వెబ్‌సైట్ లో మాత్రమే అందుబాటులో ఉండేది.

అయితే ‘బ్యాక్‌రబ్’ కి బాగా స్పందన లభించడంతో ఇద్దరూ.. తమ PhD కి అక్కడితో స్వస్తి చెప్పి, ఒక అద్దె గదిలో సెకండ్ హ్యాండ్ కంప్యూటర్లతో సెప్టెంబర్ 4, 1998లో గూగుల్ సంస్థను స్థాపించారు.

‘గూగుల్‌’ అనేది ‘గూగోల్‌’ అనే పదం నుంచి వచ్చింది. ‘గూగోల్‌’ అంటే ‘ఒకటి పక్కన వంద సున్నాలు గల సంఖ్య’. అంటే.. అంత ఎక్కువ సమాచారాన్ని మీరు గూగుల్ లో పొందవచ్చు అనేది ఈ పేరులో ఉన్న అర్ధం అన్నమాట.

Google Success Story
Google Success Story

అయితే.. వెబ్ పరిశోధనల కోసం తమ కొత్త ఇంజిన్‌ను సిద్ధం చేసిన కొద్ది కాలానికే, ఇంటర్నెట్ వెబ్ పరిధిలో లేని ఇన్ఫర్మేషన్ కోసం బ్రిన్ మరియు పేజ్ లు ఆలోచించడం మొదలుపెట్టారు, అంటే పుస్తకాల డిజిటలీకరణ, ఆరోగ్యం, వార్తలకి సంబంధించిన సమాచారం వంటివి.

ఈ సమాచారాలని అన్నిటిని పొందుపరచడంతో.. గూగుల్ కు అనూహ్యమైన ఆదరణ లభించింది. ఇలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మార్పులు, చేర్పులు చేసుకుంటూ ఎదగసాగింది గూగుల్.

దీనితో 2010 నుంచి గూగుల్ వెబ్సైటులో యాడ్స్ ని ప్రచురితం చేయడం మొదలుపెట్టింది.

ఉదాహరణకి నేను వాచ్ గురించి గూగుల్ లో ‘వాచ్ ఎలా పని చేస్తుంది’ అనే పోస్ట్ చదువుతున్నాను అనుకుందాం.. గూగుల్ అందులో ‘వాచ్’ అనేదాన్ని కీ వర్డ్ గా పరిగణించి వాచ్ కి సంబంధించిన యాడ్స్ ను పోస్ట్ పక్కన ప్లే అయ్యేలా చేస్తుంది అన్నమాట.

ఈ కాన్సెప్ట్ అనేది ఇంటర్నెట్ వినియోగదారులకు మరియు వ్యాపారదారులకు కూడా బాగా ఉపయోగపడుతూ, ఆసక్తికరంగా ఉండటంతో ఇంటర్నెట్ లో గూగుల్ వినియోగదారుల సంఖ్య క్రమేపీ పెరగసాగింది. దీనితో అప్పటివరకు అందుబాటులో లేని మరియు ఎవరూ ఊహించని కొత్తకొత్త అప్లికేషన్స్ ని గూగుల్ ఒక్క్కోక్కటిగా ప్రవేశపెట్టడం మొదలుపెట్టింది.

Gmail, Google Maps, YouTube, Google Drive, Google Plus, Google Docs, Google Sheets, Blogger, Google Photos, Google Chrome, Google Play Store, Google Pay, Google Assistant Google Keep, Google Allo, Hangouts, Google Analytics లాంటి ఎన్నో యాప్స్ తో అన్ని రంగాల వారినీ ఆకర్షిస్తూ టెక్నాలజీ రంగంలోనే పెను మార్పును తీసుకుని వచ్చింది గూగుల్.

Google Products
Google Products

సాఫ్ట్ వేర్ రంగంలోనే కాక, హార్డ్ వేర్ రంగంలో కూడా తనదైన సత్తాని చాటుకుంది. గూగుల్ ఫోన్ ని కూడా మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. ఫోన్ నే కాకుండా గూగుల్ హోమ్ స్పీకర్, గూగుల్ వైఫై రౌటర్, గూగుల్ డే డ్రీమ్ హెడ్ సెట్ లాంటి పరికరాలను కూడా గూగుల్ ఉత్పత్తి చేస్తోంది..

సెకనుకు గూగుల్ ను వాడే వారి సంఖ్య 60,000 మంది అంటే గూగుల్ యొక్క సక్సెస్ ఏపాటిదో మీరే అర్ధం చేసుకోవచ్చు.

చూడండి ఫ్రెండ్స్, బ్రిన్ మరియు లారీ పేజ్ లు కొద్దిపాటి సక్సెస్ సరిపోతుంది అని అనుకుంటే ఈరోజు గూగుల్ ఇన్ని ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసి ఉండేది కాదేమో, Yahoo లాగా మనకి ఒక ఆప్షన్ లానే ఉండేదేమో..

బ్రిన్ మరియు లారీ పేజ్ లు గొప్పగా ఆలోచించారు కాబట్టే వాళ్ళకి గొప్ప విజయం లభించింది. మీరూ.. గొప్పగా ఆలోచిస్తే మీ విజయాలు కూడా గొప్పగానే ఉంటాయి. చిన్నగా ఆలోచిస్తే ఫలితాలు కూడా చిన్నగానే ఉంటాయి. కాబట్టి ఈరోజు నుంచే గొప్పగా ఆలోచించడం మొదలుపెట్టండి.

OK ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ కనుక మీకు నచ్చినట్టయితే మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.

You May Also Like: Swiggy Success Story In Telugu

Thank You

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *