How Google Maps Works in Telugu
Technology,  Uncategorized

How Google Maps Works in Telugu

ఈ రోజుల్లో మనకి సమాచారం కావాలన్నా వెంటనే మనకి గుర్తుకువచ్చేది, మనం ఓపెన్ చేసేది ఒకే ఒక్క యాప్  గూగుల్….

ఎలాంటి సమాచారాన్ని అందించడంలోనైనా గూగుల్ కి గూగుల్ నే సాటి తప్ప వేరేదేది లేదు దానికి పోటీ. అదే విషయాన్ని ట్రాఫిక్ సమాచారాన్ని అందివ్వడంలో కూడా నిరూపించుకుంది గూగుల్.

మనం ఎక్కడికైనా కొత్త ప్రదేశాలకి వెళ్లాల్సి వస్తే Google Maps ఆన్ చేసి ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రదేశం పేరు ఇస్తాం, మనం ఉన్న చోటు నుంచి అది ఎంత దూరంలో ఉంది, ట్రాఫిక్ ఎంత ఉంది,ఏ దారిలో వెళితే త్వరగా చేరుకుంటాం, ఎంత సమయంలో చేరుకుంటాం అనే మొత్తం సమాచారాన్ని కొన్ని సెకెన్ల వ్యవధిలోనే మన ముందు ఉంచుతుంది Google Maps.

అతి తక్కువ సమయంలో ఇంత సమాచారాన్ని Accurate గా గూగుల్ ఎలా ఇవ్వగలుగుతోంది ? Google Maps వేటి ఆధారంతో పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Google ఈ మొత్తం సమాచారాన్ని రెండు రకాలుగా సేకరిస్తుంది

1. గత చరిత్ర ఆధారంగా నిర్దిష్టమైన రోజులలో నిర్దిష్ట సమయాలలో నిర్దిష్ట దారిలో (particular day, time and route) ప్రయాణించడానికి పట్టిన సగటు సమయం ఆధారంగా…

2. ప్రస్తుతం GPS ఆన్ చేసి గూగుల్ మ్యాప్స్ చూస్తున్న వాళ్లకి సమాచారాన్ని ఇస్తూనే వాళ్ళ సెన్సార్లు మరియు స్మార్ట్ ఫోన్ లు పంపిన Real timeme డేటా బట్టి ఆ ప్రదేశంలో కార్లు ఎంత వేగంగా కదులుతున్నాయో ఆ సమాచారాన్ని సేకరిస్తుంది.

ఈ విధంగా నిర్దిష్ట ప్రదేశంలో GPS ఆన్ చేసిన వాహనాల సగటు కదలిక బాగా నెమ్మదిగా ఉంటే ఆ దారిని ఎరుపు రంగుతోను, సాధారణంగా ఉంటే ఆ దారిని పసుపు రంగుతోను, వాహనాల కదలిక వేగంగా ఉంటే దానిని పచ్చ రంగుతోను గూగుల్ మ్యాప్స్ మనకు చూపిస్తుంది.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *