Why Thumbnails are Unique
Science,  Uncategorized

Why Fingerprints are Unique?

మన చేతి మరియు కాళ్ళ క్రింది భాగంలో ఉండే చిన్ని చిన్ని గట్లు వంటి నమూనాలని వేలి ముద్రలు(Fingerprints) అని  అంటారు. ఈ వేలిముద్రలు అనేవి మనం తల్లి గర్భంలో ఉన్న 10వ వారం నుంచే ఏర్పడటం మొదలయ్యి 6 వ నెల వచ్చేసరికి పూర్తి రూపాన్ని దాల్చుకుంటాయి.

ఈ Fingerprints ఎలా ఏర్పడతాయి

సాధారణంగా మన అరచేతిలోని ఉండే చర్మం మూడు పొరలుగా విభజించబడి ఉంటుంది. అందులో పైపొరని బాహ్యపొర అని, మధ్య పొరని బేసల్ పొర అనీ, కింది పోరని ఆంతః పొర అనీ అంటాము.

తల్లి గర్భములో ఉన్నప్పుడు ఈ బేసల్ పొర అనేది మిగిలిన రెండు పొరలకన్నా వేగంగా పెరగడం మొదలుపెడుతుంది.

ఈ విధంగా వేగంగా పెరిగిన బేసల్ పొర మిగిలిన రెండు పొరలపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ ఒత్తిడి వల్ల బాహ్య మరియు అంతః పొరలు చిన్ని చిన్ని ముడతలుగా ఏర్పడతాయి. గర్భంలో ఉన్నప్పుడు ఏర్పడిన ఈ ముడతల ఫలితమే ఈరోజు మన అరచేతులకి, మరియు అరికాళ్ళకీ ఉన్న వేలిముద్రల ఆకారం.

సరే మన అసలు ప్రశ్నకి వస్తే ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఎందుకు ఉండవు?

Fingerprints
Fingerprints

పలురకాల కారణాలు ఈ వేలిముద్రల(Fingerprints) రూపాన్ని ప్రభావితం చేస్తాయి.

అందులో రక్తపోటు, రక్తములో ఉన్న ఆక్సిజన్ స్థాయి, తల్లి తీసుకుంటున్న పోషక పదార్ధాలు, హార్మోన్ లెవెల్స్, వేలిముద్రలు ఏర్పడు కాలంలో గర్భంలో ఉన్న పిండం యొక్క స్థానం, ఉమ్మనీటి సాంద్రత, మరియు అది ఏర్పరిచే ఒత్తిడి ఇవన్నీ మన వేలిముద్రల ఆకారాన్ని ప్రభావితం చేసి మనిషికి మనిషికీ, చేతికి చేతికీ ఉన్న వేలిముద్రల ఆకారంలో వ్యత్యాసాన్ని ఏర్పరుస్తాయి.

సరే మరి ఒకే గర్భంలో పుట్టిన కవల పిల్లల వేలిముద్రలు అయినా ఒకేలా ఉంటాయా అని  అనుమానం మీకు రావొచ్చు.

ఒకే గర్భంలో పుట్టినా శిశువుల ముఖ రూపాలు ఒకేలా ఉన్నప్పటికీ  ఇద్దరి వేలిముద్రలు మాత్రం ఒకలాగా ఉండవు.

దీనికి   గర్భస్థ శిశువు యొక్క కదలిక   పనితీరు స్థాయి మరియు కడుపు యొక్క పరిస్థితి, మరియు బొడ్డు తాడు యొక్క పొడవులు  రెండు పిండాలలోని శిశువుల వేలిముద్రలు ఒకే  ఆకారంలో అభివృద్ధి చెందకుండా నిరోధిస్తాయి.

ఏది ఏమైనప్పటికి ఇన్ని కోట్ల మంది జనాభాలో ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా లేకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే..

 

You May Also like: గురుత్వాకర్షణ పని చేయకపోతే  ఏమి జరగవచ్చు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *