Life Style,  Uncategorized

Is Fasting is Good for Health?

 

ఉపవాసం ఉండటం ఆరోగ్యపరంగా మంచిదేనా?

‘లంకణం పరమౌషధం’ అన్నారు పెద్దలు. ఆ సంగతి ఎలా ఉన్నా దేవుడి పేరుతో అసలేమీ తినకుండా కటిక ఉపవాసం చేసేవాళ్లు కొందరయితే, మితాహారంతో పాక్షిక ఉపవాసం చేసేవాళ్లు మరికొందరు. కారణమేదయినా పూర్తిగా తినడం మానేయడం కన్నా ఒకపూట భోజనం చేసి, మరో పూట ఏ పండ్లో తినడం మంచిదే అన్నది మన వైద్యుల మాట.

Is Fasting id Good For Health in Telugu
Is Fasting id Good For Health in Telugu

ఈ పాక్షిక ఉపవాసం ఆరోగ్యానికి మంచిదేనని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకు చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. దీని వల్ల బరువు తగ్గడంతోపాటు బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్… వంటివి కూడా తగ్గుతాయట. ఇలా తరచూ ఉపవాసాలుండటం వల్ల ఆయుఃప్రమాణం కూడా పెరుగుతుందట.

ఇందుకోసం కొందరికి ఒకరోజు వాళ్లు రోజువారీ తీసుకునే ఆహారంలో 25 శాతాన్నీ, మరోరోజు ముందురోజు తగ్గించినదానితో కలిపి 175 శాతాన్నీ ఇచ్చారట. ఇలా ఒకరోజు ఉపవాసం, మరో రోజు విందుభోజనం చేయడం వల్ల మూడు వారాలు గడిచేసరికి వాళ్లలో మొత్తంగా యాంటీఆక్సిడెంట్ల పనితీరు మెరుగయిందట. అంటే శరీరానికి అప్పుడప్పుడూ కొంత ఇబ్బందినీ ఒత్తిడినీ కలగచేయడంవల్ల దానికది బాగు చేసుకునే శక్తి అంటే.. పునరుజ్జీవ శక్తి పెరుగుతుందని వాళ్లు చెబుతున్నారు.

Is Fasting is Good for your Health? TeluguForbes
Is Fasting is Good for your Health?

అలాగని రోజూ ఉపవాసాలు చేయకూడదు. శరీరానికి సరిపడే క్యాలరీలు అందిస్తూనే ఉపవాసం చేయడంవల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నది ఈ పరిశోధన సారాంశం.

You May Also Like: Tips to Young Age People in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *