Science,  Uncategorized

How are cyclones named? | Explained in Telugu

తుఫాన్(Cyclones) లకి పేర్లు ఎలా పెడతారు?

తుఫాన్(Cyclones) లకి రకరకాల పేర్లను పెడుతూ ఉంటారు.. హుద్ హుద్, తిత్లీ, లైలా… ఇప్పుడు పెథాయ్. వినడానికి విచిత్రంగా ఉండే ఈ పేర్లను(Names) ఎవరు పెడతారు, వేటి ఆధారంగా పెడతారో ఇప్పుడు తెలుసుకుందాం…

ఇలా తుఫాన్ లకి పేర్లు పెట్టే సంప్రదాయం అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాలలో 1953 నుంచే ఉంది. ఐక్యరాజ్య సమితికి చెందిన “వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజషన్” అనే సంస్థ తుఫాన్(Cyclones) లకి పేర్లు పెట్టే పనులను చూసుకుంటుంది.

కానీ, దక్షిణ ఆసియాలో ఈ మధ్య వరకు కూడా తుఫాన్ లకు పేర్లు(names) పెట్టే సాంప్రదాయం లేదు. ఇటీవలే ఈ సాంప్రదాయం మొదలయ్యింది. గతంలో చాలా ఏళ్ళు పాటు పసిఫిక్ మహా సముద్రంలో పుట్టిన చాలా తుఫాన్ లు ఏ పేరు లేకుండా అనామకంగానే ఉండిపోయాయి.

తుఫాన్ లకు పేర్లు లేకపోతే వాటి గురించి వివరించడం, విశ్లేషించడం, చర్చించడం కాస్త గందరగోళంగా ఉంటోందని వాతావరణ నిపుణులు గ్రహించారు. దీనితో పాటుగా మీడియాలో ప్రసారం చేసేందుకు, ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా తుఫాన్ లకి పేర్లు పెట్టడం సమంజసమని వారు భావించారు.

తుఫాన్ లకి పేర్ల కోసం 2004 లో ప్రపంచ వాతావరణ సంస్థ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఉంటున్నది నార్త్ ఇండియన్ ఓసియన్ జోన్. ఈ జోన్ లో మన దేశంతో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక , థాయిలాండ్ , మయన్మార్, ఒమన్, మాల్దీవులు ఉన్నాయి. ఈ ఎనిమిది దేశాలు ఆ సమావేశంలో పాల్గొన్నాయి. ఇందులో ప్రతీ దేశం తమ తరుపు నుంచి 8 పేర్లను కమిటీకి సమర్పించగా 8 X 8 మొత్తంగా 64 తుఫాన్ పేర్ల జాబితా తయారయ్యింది.

List of Cyclones names
List of Cyclones names

ఈ పేర్లను భవిష్యత్తులో హిందూ మహా సముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రలాలో రాబోయే తుఫాన్ లకి పెట్టాలని ఆ సమావేశంలో నిర్ణయించారు.

అయితే ఏ తుఫానుకు ఏ పేరు ఎప్పుడు పెట్టాలి అనేదాని పైన కూడా కమిటీ ఒక ప్రణాళికను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా ఎనిమిది దేశాలను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అమర్చుకుని ఈ సమావేశం అనంతరం వచ్చే తుఫాన్ లకి పేర్లు నిలువుగా…అంటే.. ఒమన్, అగ్ని, హిబ్రు, ప్యార్ అలా ఒకదాని తరువాత ఒకటి పేర్లు పెట్టాలని సమావేశంలో నిర్ణయించుకున్నారు.

ఈ విధంగా ఇప్పటివరకు 55 తుఫాన్ లు పూర్తి కాగా 56 వ తుఫాన్ పేరు పెథాయ్ గా థాయిలాండ్ ఇచ్చిన పేరును ఈ తుఫాన్ కు నామకరణం చేశారు.

సాధారణంగా 10 సంవత్సరాలకి ఒకసారి ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ రకంగా పేర్లను సేకరించి పెట్టాలని సమావేశంలో 8 దేశాలు నిర్ణయించుకోగా 4 సంవత్సరాలలోనే 56 తుఫాన్ లు వచ్చి పేర్ల జాబితాను ఆక్రమించేశాయి. తాజా తుఫాన్ పేర్ల జాబితా కోసం త్వరలోనే 8 దేశాలు మళ్ళీ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.

You May Also Like: Big bang Theory అంటే ఏమిటి? ఈ విశ్వం ఎలా పుట్టింది?

OK ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త విషయం నేర్చుకున్నారు అనుకునుటున్నాను. Knowledge అనేది పంచుకుంటే పెరిగేది. కాబట్టి మీ స్నేహితులు అందరితో ఈ ఆర్టికల్ ని పంచుకొండి . ఇటువంటి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకునేందుకు Telugu Forbes ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.

మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.

Thank You