A Caterpillar May Solve Our Plastic Pollution Problem
Science,  Uncategorized

A Caterpillar May Solve Our Plastic Pollution Problem

ఈరోజుల్లో ఎక్కడ చూసినా పాలిథీన్ కవర్ల(Plastic Covers) వినియోగం అనేది విరివిగా జరుగుతోంది. మన రోజు వారి జీవితంలో ప్లాస్టిక్ కవర్లు కూడా ఒక భాగం అయిపోయాయి అంటే అది అతిశయోక్తేమీ కాదు. మనం ఏ వస్తువులు క్యారీ చేయాలన్నా ప్లాస్టిక్ కవర్లు తప్ప వేరే రకమైన బాగ్స్ తప్ప వేరే ఏమి మన ఊహకి కూడా తట్టట్లేదు. దానికి కూడా కారణం లేకపోలేదు వేరే రకమైన బ్యాగ్ లతో పోలిస్తే ప్లాటిక్ బ్యాగ్ లు అనేవి అతి తక్కువ ధరకే, మరియు మంచి మంచి డిజైన్ లతో మార్కెట్ లో లభ్యమవుతున్నాయి కనుక…

అయితే ప్లాస్టిక్(Plastic covers) వినియోగం అంత మంచిది కాదు అని, పాలిథీన్ అనేది భూమిలో కరగడానికి సుమారుగా 100 నుండి 400 సంవత్సరాలకు పైగా పట్టొచ్చని సైంటిస్టులు హెచ్చరిస్తున్నప్పటికీ కొన్ని కొన్ని కారణాల రీత్యా వాటి వాడుకను మనం నివారించలేకపోతున్నాం.

ప్రతి సంవత్సరం, 80 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ పాలిథిలిన్ ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేయబడుతోంది. ఇదే తరహాలో మనం పాలిథీన్ కవర్లని వినియోగించుకుంటూ పోతే రానున్న తరాలవారికి భూమిని తవ్వితే దొరికేది మన్ను కాదు, పాలిథీన్ కవర్లే అని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇది ఇలా ఉన్న తరుణంలో కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ఒక తీపి కబురుని మన ముందుకి తీసుకొచ్చారు.

వాళ్ళ పరిశోధనలను బట్టి తేలింది ఏమిటంటే,

“లార్వా దశలో ఉన్న గొంగళీ పురుగు కొన్ని రకములైన ప్లాటిక్స్ ని తిని అరిగించుకోగలదని… ”

Plastic-eating-Caterpillar-Could-Munch-Waste
Plastic-eating-Caterpillar-Could-Munch-Waste

ఇవి సాధారణంగా తీనెటీగలు ఏర్పరుచుకున్న గూడులను ఆహారంగా తింటూ ఉంటాయి. ఈ గూడులు ఒక రకమైన ప్లాటిక్ తో నిర్మితమై ఉంటాయి. ఇది గమనించిన శాస్త్రవేత్తలు వాటి మీద పరిశోధనలు విస్తృతం చేయగా ప్లాస్టిక్ సంచుల్లో మరియు ఇతర ప్లాస్టిక్ ప్యాకేజింగ్ లలో విస్తృతంగా ఉపయోగించే పాలిమర్ ను మరియు వాటి రసాయన బంధాలను కూడా అవి విచ్ఛిన్నం చేయగలుగుతున్నట్లు వారు గమనించారు.

Plastics Eating Caterpillar
Plastics Eating Caterpillar

గొంగళిలో ఉండే మైక్రోబ్స్ ఈ ప్లాస్టిక్ ను విచ్ఛిన్నం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని, దీని మీద ఇంకా పరిశోధనలు జరపాల్సి ఉందని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన డాక్టర్ పోలో బొంబెల్లి అనే శాస్త్రవేత్త తెలిపారు.

ఏది ఏమైనప్పటికి రానున్న రోజుల్లో ప్లాస్టిక్ కాలుష్య నివారణకు ఒక పరిష్కారం రాబోతున్నది అనేది మన అందరికి ఒకరకమైన శుభవార్తే..

ఫ్రెండ్స్.. వీలైనంత వరకు ప్లాస్టిక్(plastic covers) వాడకాన్ని తగ్గించడంలో మనవంతు ప్రయత్నం కూడా మనం చేద్దాం..

You May Also like: Gravity లేకపోతే ఏమి జరగవచ్చు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *