• Startup Stories,  Uncategorized

  Swiggy Success Story In Telugu

  ‘ఎక్కడో ఒక చోట జరిగిన చిన్న సంఘటన వేరే ఎక్కడో జరిగే పెద్ద పెనుమార్పుకి కారణమవ్వొచ్చు’ దీనినే బట్టర్ ఫ్లై ఎఫెక్ట్ అని అంటాం. అలా… ఎక్కడో బిట్స్ పిలానీలో చదువుకోసం వెళ్లిన శ్రీహర్ష మరియు నందన్ రెడ్డి అనే ఇద్దరి వ్యక్తుల కలయిక ఈరోజు Swiggy రూపుదాల్చుకోవడానికి మరియు దాని సక్సెస్ కి కారణమయ్యింది. ఈరోజున మనకి కావలసిన రెస్టారెంట్ ల నుంచి కావలసిన ఫుడ్ మన ఇంటికి నిమిషాలలో వచ్చేస్తోంది అంటే దానికి కారణం శ్రీహర్ష మరియు నందన్ రెడ్డి ల యొక్క కృషి ఫలితమే… అసలు Swiggy ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలయ్యింది? Swiggy సృష్టికర్తలు ఎవరు? Swiggy ఇంత సక్సెస్ అవ్వడానికి గల ఏమిటి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం… శ్రీహర్ష మరియు నందన్ లకి కాలేజీ రోజుల నుంచే ఏదోక బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి, మన కాళ్ళమీద మనం నిలబడి, 10 మందికి దారి చూపాలి అనే ఆలోచన ఉండేది. ఈ ఆలోచనే వాళ్లకి చదువు అవ్వగానే…

 • How Human Brain Works in Telugu
  Science,  Uncategorized

  How Human Works? Explained in Telugu

  మనిషి ఆదిమానవుడిగా కనీసం బట్టలు కూడా కప్పుకోవడం తెలియని స్థాయి నుండి మరో మర మనిషిని తయారు చేయగలిగినంత గొప్ప స్థాయికి ఎదిగాడు అంటే అది కేవలం ఎక్కడో మెదడులో(Brain) ఒక మూల పుట్టిన ఆలోచన యొక్క ఫలితమే. మనం ఈరోజు గాలిలో ప్రయాణం చేస్తున్నామన్నా, స్మార్ట్ ఫోన్ ని వాడుతున్నా, ఇంటర్నెట్ ని వాడుతున్నా, ఒక భవనంలో ఏసీ గదిలో కుర్చున్నా… ఇవన్నీ ఎవరోకరి మెదడులోని పుట్టిన ఆలోచనల యొక్క ప్రతిరూపాలే.. మనిషి మామోలు స్థాయి నుంచి మోడరన్ స్థాయి ఎదగడానికి గల కారణం కేవలం అతడి మెదడు(Brain) మాత్రమే.. అలాంటి మెదడు(Brain) ఎలా పనిచేస్తుంది? దానికి ఉన్న శక్తి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం… మన మెదడు రెండు విడి విడి భాగాలుగా ఉంటుంది. ఇందులో మెదడులోని కుడి వైపు భాగం మన శరీరంలోని ఎడమవైపు భాగంలోని అవయవాలను… మెదడులోని ఎడమవైపు భాగం మన శరీరంలోని కుడివైపు శరీరభాగాలనూ కంట్రోల్ చేస్తాయి. మన Brain లో Consious Mind మరియు Subconcious Mind అని…

 • WhatsApp Success in Telugu
  Startup Stories,  Uncategorized

  WhatsApp Successful Story in Telugu

  ఈరోజులలో అత్యంత ప్రజాధారణ పొందిన App ఏమైనా ఉంది అంటే అది ‘WhatsApp’ అనే చెప్పొచ్చు. Play Store లో కొన్ని వందల మెసేజింగ్ App లు ఉన్నప్పటికీ వాటిలో మొదటి ప్రాధాన్యత మాత్రం ‘WhatsApp’ కే ఇస్తుంటాం అందరం.. ఏ మాధ్యమాలలో కూడా WhatsApp గురించిన adevetisement లను మచ్చుకు ఒక్కసారి అయినా మనం చూసి ఉండం. అసలు ఎటువంటి adevetisementలు లేకుండా WhatsApp అంత ఫేమస్ ఎలా అయ్యింది? దాని యొక్క Successful Story ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం… Jhon koum మరియు Briyan Acton అనే ఇద్దరి మిత్రుల యొక్క ఎన్నో నిద్రలేని రాత్రుల కష్ట ఫలితమే ఈ WhatsApp. అంతే కాదు మనకి నిద్ర లేకుండా చేస్తోంది కూడా అదే… వీరు ఇద్దరు  Yahoo లో సుమారు 9 సంవత్సరాలు కలిసి పనిచేశారు. తరువాత వాళ్ళ జీవితంలో ఏదో కోల్పోయినట్లు అనిపించి, ఇద్దరూ Yahoo లో ఉద్యోగం వదిలేసి ప్రపంచ పర్యటనకు బయలుదేరతారు. ఒక సంవత్సరం తరువాత వారి దగ్గర ఉన్న…

 • Artificial Moon, China in Telugu
  Science,  Uncategorized

  China Is going to Launch Its Own Artificial Moon in 2020

  Artificial Moon (కృత్రిమ చందమామ) ను తయారుచేయనున్న చైనా: చైనా దేశం 2020 సంవత్సరం నాటికి Artificial Moonను తయారు చేయనుంది. చైనా దేశంలో చెంగ్డూ అనే నగరానికి రాత్రి సమయాలలో స్ట్రీట్ లైట్స్ కి సరఫరా చేసే మొత్తం విద్యుత్ మరియు దాని యొక్క ఖర్చు అనేది భారీ మొత్తంలో అవుతుండటంతో ఈ సమస్యను అధిగమించేందుకు చైనా దేశం Artificial Moon (కృత్రిమ చందమామ) ను తయారు చేయడానికి సంసిద్ధమైంది . చైనాలోని అత్యధిక జనాభా కలిగిన నగరాలలో చెంగ్డూ నగరం ఒకటి. ఈ నగరంలో సుమారుగా 10 మిలియన్ల జనాభా నివసిస్తున్నారు. అయితే ఈ నగరంలోని స్ట్రీట్ లైట్స్ యొక్క విద్యుత్ సరఫరాకి గత కొద్ది సంవత్సరాలుగా ఇబ్బంది వాటిళ్లుతూనే ఉంది. దీనికి శాశ్వత పరిష్కారాన్ని చూపేందుకు చైనా Artificial Moon ని తయారు చేయనుంది. చైనా మీడియా నివేదిక ప్రకారం మానవ నిర్మితమైన ఈ చందమామ చెంగ్డూ నగరానికి భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులోనున్న కక్షలో 2020 నాటికి చైనా…

 • Science,  Uncategorized

  Big bang Theory | Explained in Telugu

  విశ్వం… అదొక అంతు చిక్కని ప్రశ్నల సమ్మేళనం… మనం ఎప్పుడు పుట్టాం, విశ్వం ఎక్కడ మొదలయ్యింది, విశ్వానికి తుది, చివర ఎక్కడ?, ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు అంతం కాబోతోంది… ఇవన్నీ మానవుడి అనేక ఏళ్లుగా వేధిస్తున్న ప్రశ్నలు.. విశ్వం పుట్టుక యొక్క ప్రశ్నల చిక్కుముడిని విప్పడానికి ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు… సిద్ధాంతాలని కూడా ప్రతిపాదించారు. వాటన్నిటిలో స్టడీ స్టేట్ థియరీ, బిగ్ బ్యాంగ్ (Big bang) థియరీలు  ప్రముఖమైనవి. ఫ్రెడ్ హోయిల్ ప్రతిపాదించిన స్టడీ స్టేట్ థియరీ ప్రకారం: ‘విశ్వం ఇప్పుడు ఎలా ఉందో, పుట్టినప్పుడు కూడా అలానే ఉంది, ఇదే స్థితిలో కొనసాగుతూ ఉంటుంది. దీనికి ఆది, అంతాలు లేనే లేవు. అలా విశ్వం అనేది అనంతంగా విస్తరించి ఉంటుంది. దీనినే యధాస్థితివాదం అంటాం’ అని ఆయన ప్రతిపాదించారు. అయితే, ప్రతిదానికి సమర్ధించే వాళ్ళు, విభేదించేవాళ్ళు ఉన్నట్లే ఈ థియరీకి కూడా హేతోపవాదులు లేకపోలేదు. ఈ స్టడీ స్టేట్ థియరీని విభేదిస్తూ హేతువాదులు తెచ్చిన థియరీనే బిగ్ బ్యాంగ్ థియరీ(Big bang…

 • A Caterpillar May Solve Our Plastic Pollution Problem
  Science,  Uncategorized

  A Caterpillar May Solve Our Plastic Pollution Problem

  ఈరోజుల్లో ఎక్కడ చూసినా పాలిథీన్ కవర్ల(Plastic Covers) వినియోగం అనేది విరివిగా జరుగుతోంది. మన రోజు వారి జీవితంలో ప్లాస్టిక్ కవర్లు కూడా ఒక భాగం అయిపోయాయి అంటే అది అతిశయోక్తేమీ కాదు. మనం ఏ వస్తువులు క్యారీ చేయాలన్నా ప్లాస్టిక్ కవర్లు తప్ప వేరే రకమైన బాగ్స్ తప్ప వేరే ఏమి మన ఊహకి కూడా తట్టట్లేదు. దానికి కూడా కారణం లేకపోలేదు వేరే రకమైన బ్యాగ్ లతో పోలిస్తే ప్లాటిక్ బ్యాగ్ లు అనేవి అతి తక్కువ ధరకే, మరియు మంచి మంచి డిజైన్ లతో మార్కెట్ లో లభ్యమవుతున్నాయి కనుక… అయితే ప్లాస్టిక్(Plastic covers) వినియోగం అంత మంచిది కాదు అని, పాలిథీన్ అనేది భూమిలో కరగడానికి సుమారుగా 100 నుండి 400 సంవత్సరాలకు పైగా పట్టొచ్చని సైంటిస్టులు హెచ్చరిస్తున్నప్పటికీ కొన్ని కొన్ని కారణాల రీత్యా వాటి వాడుకను మనం నివారించలేకపోతున్నాం. ప్రతి సంవత్సరం, 80 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ పాలిథిలిన్ ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేయబడుతోంది. ఇదే తరహాలో మనం పాలిథీన్ కవర్లని…

 • What would happen if gravity stopped working
  Science,  Uncategorized

  what would happen if gravity stopped working in Telugu

  Gravity లేదా గురుత్వాకర్షణ అనగానే మనకి గుర్తొచ్చేది స్కూల్ రోజుల్లో సైన్స్ టీచర్లు చెప్పిన కథ. న్యూటన్ అన్నవాడు ఆపిల్ చెట్టు కింద కూర్చోవడం, ఆపిల్ చెట్టు నుండి ఆపిల్ కిందకి రాలడం, అది కిందకే ఎందుకు రాలాలి పైకి ఎందుకు వెళ్లిపోకూడదు? అంటే ఏదో శక్తి దీనికి కారణమవుతోందని ఆ శక్తి పేరు గురుత్వాకర్షణ శక్తి అని న్యూటన్ కనిపెట్టడం. సైన్స్ అంటే ఇష్టం లేనివారు న్యూటన్ కూర్చోక కూర్చోక ఆ సమయంలోనే కూర్చోవాలా? కూర్చుంటే కూర్చున్నాడు ఆ సమయంలోనే ఆపిల్ కిందకి పడాలా ? పడితే పడింది దొరికింది తిని వెళ్ళిపోచ్చు గా మనకి ఈ సైన్స్ బాధ తప్పేది అని చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఆ గురుత్వాకర్షణ శక్తి అనేదే లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో దాని యొక్క విలువ ఎంతటిదో ఇది చదివిన తరువాత అర్ధమవుతుంది. 1. Gravity లేకపోతే జరిగే మొట్టమొదటిది సంఘటన ఏమిటంటే భూమిని ఆధారం చేసుకుని నిలపడినవేవి భూమి మీద ఉండవు. భూమి నుంచి…

 • Why Thumbnails are Unique
  Science,  Uncategorized

  Why Fingerprints are Unique?

  మన చేతి మరియు కాళ్ళ క్రింది భాగంలో ఉండే చిన్ని చిన్ని గట్లు వంటి నమూనాలని వేలి ముద్రలు(Fingerprints) అని  అంటారు. ఈ వేలిముద్రలు అనేవి మనం తల్లి గర్భంలో ఉన్న 10వ వారం నుంచే ఏర్పడటం మొదలయ్యి 6 వ నెల వచ్చేసరికి పూర్తి రూపాన్ని దాల్చుకుంటాయి. ఈ Fingerprints ఎలా ఏర్పడతాయి సాధారణంగా మన అరచేతిలోని ఉండే చర్మం మూడు పొరలుగా విభజించబడి ఉంటుంది. అందులో పైపొరని బాహ్యపొర అని, మధ్య పొరని బేసల్ పొర అనీ, కింది పోరని ఆంతః పొర అనీ అంటాము. తల్లి గర్భములో ఉన్నప్పుడు ఈ బేసల్ పొర అనేది మిగిలిన రెండు పొరలకన్నా వేగంగా పెరగడం మొదలుపెడుతుంది. ఈ విధంగా వేగంగా పెరిగిన బేసల్ పొర మిగిలిన రెండు పొరలపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ ఒత్తిడి వల్ల బాహ్య మరియు అంతః పొరలు చిన్ని చిన్ని ముడతలుగా ఏర్పడతాయి. గర్భంలో ఉన్నప్పుడు ఏర్పడిన ఈ ముడతల ఫలితమే ఈరోజు మన అరచేతులకి, మరియు అరికాళ్ళకీ ఉన్న…

 • How Internet Works in Telugu
  Technology,  Uncategorized

  How Internet Works in Telugu

  ఈరోజుల్లో Internet అనేది మన  రోజువారీ జీవితాలలో ఒక భాగమైపోయింది. పాత రోజులలో మనకి ఏదైనా information కావాలి అంటే పుస్తకాలనో లేదా ఎవరైనా నిష్ణాతులనో ఆశ్రయించవలసి వచ్చేది. కానీ ఈరోజుల్లో మనకి ఏమి సమాచారం కావాలన్నా అందరికి గుర్తొచ్చే ఒకే ఒక్క Source ఇంటర్నెట్. ఎలాంటి సమాచారాన్ని అవతల వ్యక్తికి చేరవేయాలన్నా లేక మనకి కావలసిన సమాచారాన్ని తెలుసుకోవాలన్నా అందరం Interenet నే ఆశ్రయిస్తున్నాం. ఇంటర్నెట్ ఉపయోగించే మెసేజ్ లు పంపుతున్నాము, ఇమెయిల్, ఫొటోస్, డేటా ఇలా వేటికన్నా ఇంటర్నెట్ నే ఒక మాధ్యమంగా వాడుతున్నాం. Internet లేకుండా ఒక రోజు గడపడం అంటే ఈరోజుల్లో అసాధ్యమనే చెప్పొచ్చు. అలాంటి Internet ఎలా పనిచేస్తుంది? మనం పంపిన మెసేజ్ లు గాని, మెయిల్స్ కానీ వేరే దేశంలో ఉన్న వాళ్లకి సైతం క్షణాలలో ఎలా చేరుకుంటున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం… పూర్వం ఒకరి నుంచి ఒకరికి క్షేమ సమాచారం తెలియాలి అంటే ఉత్తరాల ద్వారా పంపేవారు. మనం అవతల వ్యక్తికి ఉత్తరం పంపాలి అంటే…

 • How Google Maps Works in Telugu
  Technology,  Uncategorized

  How Google Maps Works in Telugu

  ఈ రోజుల్లో మనకి సమాచారం కావాలన్నా వెంటనే మనకి గుర్తుకువచ్చేది, మనం ఓపెన్ చేసేది ఒకే ఒక్క యాప్  గూగుల్…. ఎలాంటి సమాచారాన్ని అందించడంలోనైనా గూగుల్ కి గూగుల్ నే సాటి తప్ప వేరేదేది లేదు దానికి పోటీ. అదే విషయాన్ని ట్రాఫిక్ సమాచారాన్ని అందివ్వడంలో కూడా నిరూపించుకుంది గూగుల్. మనం ఎక్కడికైనా కొత్త ప్రదేశాలకి వెళ్లాల్సి వస్తే Google Maps ఆన్ చేసి ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రదేశం పేరు ఇస్తాం, మనం ఉన్న చోటు నుంచి అది ఎంత దూరంలో ఉంది, ట్రాఫిక్ ఎంత ఉంది,ఏ దారిలో వెళితే త్వరగా చేరుకుంటాం, ఎంత సమయంలో చేరుకుంటాం అనే మొత్తం సమాచారాన్ని కొన్ని సెకెన్ల వ్యవధిలోనే మన ముందు ఉంచుతుంది Google Maps. అతి తక్కువ సమయంలో ఇంత సమాచారాన్ని Accurate గా గూగుల్ ఎలా ఇవ్వగలుగుతోంది ? Google Maps వేటి ఆధారంతో పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. Google ఈ మొత్తం సమాచారాన్ని రెండు రకాలుగా సేకరిస్తుంది 1. గత చరిత్ర ఆధారంగా…