• Life Style,  Uncategorized

  Is Fasting is Good for Health?

    ఉపవాసం ఉండటం ఆరోగ్యపరంగా మంచిదేనా? ‘లంకణం పరమౌషధం’ అన్నారు పెద్దలు. ఆ సంగతి ఎలా ఉన్నా దేవుడి పేరుతో అసలేమీ తినకుండా కటిక ఉపవాసం చేసేవాళ్లు కొందరయితే, మితాహారంతో పాక్షిక ఉపవాసం చేసేవాళ్లు మరికొందరు. కారణమేదయినా పూర్తిగా తినడం మానేయడం కన్నా ఒకపూట భోజనం చేసి, మరో పూట ఏ పండ్లో తినడం మంచిదే అన్నది మన వైద్యుల మాట. ఈ పాక్షిక ఉపవాసం ఆరోగ్యానికి మంచిదేనని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకు చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. దీని వల్ల బరువు తగ్గడంతోపాటు బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్… వంటివి కూడా తగ్గుతాయట. ఇలా తరచూ ఉపవాసాలుండటం వల్ల ఆయుఃప్రమాణం కూడా పెరుగుతుందట. ఇందుకోసం కొందరికి ఒకరోజు వాళ్లు రోజువారీ తీసుకునే ఆహారంలో 25 శాతాన్నీ, మరోరోజు ముందురోజు తగ్గించినదానితో కలిపి 175 శాతాన్నీ ఇచ్చారట. ఇలా ఒకరోజు ఉపవాసం, మరో రోజు విందుభోజనం చేయడం వల్ల మూడు వారాలు గడిచేసరికి వాళ్లలో మొత్తంగా యాంటీఆక్సిడెంట్ల పనితీరు మెరుగయిందట. అంటే శరీరానికి అప్పుడప్పుడూ కొంత ఇబ్బందినీ ఒత్తిడినీ…

 • Facts-about-salary-in-Telugu-TeluguForbes
  Life Style,  Uncategorized

  Interesting Facts About ‘Salary’

    భూమి ఇప్పటికంటే ముప్పైరెట్లు వేగంగా తిరిగిందనుకో  ఏం జరుగుతుంది? అని ఇంటర్వ్యూ చేస్తున్న పెద్ద మనిషి అడిగాడు. ‘ఇంకేముంది సార్! రోజూ జీతం(Salary) వచ్చేస్తుంది!’ అని జవాబిచ్చాడు ఇంటర్వ్యూకి  వచ్చిన వ్యక్తి. నిజమే, జీతమిచ్చే కిక్కే వేరు.. ఉద్యోగం  అనేది ఫలానా మొత్తాన్ని జీతంగా ఇస్తున్నందుకు గానూ, ఫలానా సేవల్ని అందించాలంటూ ఉద్యోగీ యజమానీ చేసుకునే ఒక ఒప్పందం. జీతం రూపంలో అందుతున్న మొత్తం, పని రూపంలో ధారపోస్తున్న నైపుణ్యం … సమాన స్థాయిలో ఉన్నంత వరకూ ఎవరికీ ఇబ్బంది ఉండదు. జీతం ఎక్కువై, శ్రమ తగ్గినప్పుడు యాజమాన్యం అసంతృప్తికి లోనవుతుంది, జీతం తగ్గి శ్రమ పెరిగితే ఉద్యోగిలో అసంతృప్తి రగులుతుంది. ఏ ఉద్యోగంలో అయినా ఏడాదికి పది నుంచి పదిహేను శాతానికి మించి పెరుగుదల ఆశించడం దురాశే. జీతం పెరుగుతున్నకొద్దీ, ఉద్యోగి మీద అంచనాలూ పెరుగుతాయి. దాన్ని నిలబెట్టుకోవడం కత్తిమీద సాము వంటిదే.. తేడావస్తే…పరమపద సోపానంలో పామునోట్లో చిక్కుకున్నట్టే. శాశ్వతంగా వదిలించుకునే ప్రయత్నమూ మొదలవుతుంది. కెరీర్ విజయాన్ని కేవలం సంపాదనతో ముడిపెట్టుకున్నా ప్రమాదమే. అత్యధికంగా…

 • Tips-in-Telugu-TeluguForbes-Tips
  Life Style,  Uncategorized

  Tips to Young Age People in Telugu

  1.ఇరవై ఏళ్ల వయసులో ఆలోచనలన్నీ కలగాపులగంగా ఉంటాయి. దేని మీడా మనసు స్థిరంగా నిలవదు. మీరు అలా కాకుండా ఒక నిర్ణయానికి రండి. డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, రచయిత కావచ్చు. లక్ష్యం విషయంలో మీకు స్పష్టత ఉంటే, దానికి చేరువ కావడం కష్టమేమీ కాదు. 2. పుస్తకాలు చదవడాన్ని మీ జీవన విధానంలో భాగంగా చేసుకోండి. పుస్తకాలు చదవడం వల్ల పరిపూర్ణ జీవితం పరిచయం అవుతుంది. మీ సబ్జెక్ట్ల పుస్తకాలు  వదిలి గొప్ప గొప్ప వారి జీవిత చరిత్రలు చదవడం అలవాటు చేసుకోండి.   3. లేటుగా నిద్ర పోవడం వల్ల లేటుగా నిద్ర లేస్తాం. ఇదొక సర్కిల్. కొందరు రాత్రంతా ఏదో పని చేస్తూ గడుపుతారు. అలాంటి వారి ఆరోగ్యం అంతంత మాత్రమే అని గ్రహించాలి. క్రమశిక్షణతో కూడిన జీవితం’ సౌకర్యంగా, సుఖంగా అనిపించకపోవచ్చు. కానీ అది మన అవసరం… వేళకు నిద్ర, వేళకు లేవడం అనేది క్రమశిక్షణతో కూడిన జీవితంలో భాగం అనే విషయం గ్రహించాలి.   4.ప్రేమ అనేది ఎంత ముఖ్యం? డబ్బు…