జీవితం గురించి అద్భుతంగా చెప్పిన బుద్ధుని యొక్క కోట్స్ ని ఇక్కడ తెలుగులో పొందండి.
Buddha Quotes About Life in Telugu
మన ముందు ఏముంది, పక్కన ఏముందీ అనేది విషయం కాదు, మనలో ఏముందీ అనేదే అసలయిన విషయం..
నీ మౌనం కన్నా నీ మాటలు నీకు ఎక్కువ విలువని చేకూరుస్తాయి అనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడు.
మనసు చెప్పినట్టు మనం వినడం కాదు.. మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి.
సమస్య అనేది సమస్య కానే కాదు, దానికి నువ్వు ఎలా స్పందిస్తున్నావు అనేదే సమస్య..
ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండండి. ఎందుకంటే వారి వద్ద ప్రతీ పరిష్కారానికి ఒక సమస్య ఉంటుంది.
ఎవరూ చూడట్లేదని తప్పు చెయ్యకు. అందరూ చూస్తున్నారని అప్పు చెయ్యకు. అవి రెండూ జీవితంలో ప్రమాదమే..
వేలాది వ్యర్ధమయిన మాటలు వినడం కన్నా.. శాంతిని, కాంతిని ప్రసాదించే ఒక్క మంచిమాట విన్నా చాలు..
గమ్యం చేరుకోవడానికి మార్గం కాదు మనసు ఉండాలి.
మనం ఏది ఆలోచిస్తామో అదే మనం అవుతాము.
అదుపులేని ఆలోచనలు.. శత్రువు కన్నా ప్రమాదకరం.
You May Also Like: Richard Branson Quotes in Telugu