Science,  Uncategorized

Big bang Theory | Explained in Telugu

విశ్వం… అదొక అంతు చిక్కని ప్రశ్నల సమ్మేళనం… మనం ఎప్పుడు పుట్టాం, విశ్వం ఎక్కడ మొదలయ్యింది, విశ్వానికి తుది, చివర ఎక్కడ?, ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు అంతం కాబోతోంది… ఇవన్నీ మానవుడి అనేక ఏళ్లుగా వేధిస్తున్న ప్రశ్నలు..

విశ్వం పుట్టుక యొక్క ప్రశ్నల చిక్కుముడిని విప్పడానికి ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు… సిద్ధాంతాలని కూడా ప్రతిపాదించారు.

వాటన్నిటిలో స్టడీ స్టేట్ థియరీ, బిగ్ బ్యాంగ్ (Big bang) థియరీలు  ప్రముఖమైనవి.

ఫ్రెడ్ హోయిల్ ప్రతిపాదించిన స్టడీ స్టేట్ థియరీ ప్రకారం:

‘విశ్వం ఇప్పుడు ఎలా ఉందో, పుట్టినప్పుడు కూడా అలానే ఉంది, ఇదే స్థితిలో కొనసాగుతూ ఉంటుంది. దీనికి ఆది, అంతాలు లేనే లేవు. అలా విశ్వం అనేది అనంతంగా విస్తరించి ఉంటుంది. దీనినే యధాస్థితివాదం అంటాం’ అని ఆయన ప్రతిపాదించారు.

అయితే, ప్రతిదానికి సమర్ధించే వాళ్ళు, విభేదించేవాళ్ళు ఉన్నట్లే ఈ థియరీకి కూడా హేతోపవాదులు లేకపోలేదు. ఈ స్టడీ స్టేట్ థియరీని విభేదిస్తూ హేతువాదులు తెచ్చిన థియరీనే బిగ్ బ్యాంగ్ థియరీ(Big bang Theory). దీనినే మహా విస్ఫోటక సిద్ధాంతం అని కూడా అంటాం…

ఈ థియరీ ప్రకారం….

ఇప్పుడు విశ్వంలో ఉన్న పాల పుంతలు, నక్షత్రాలు, గ్రహాలూ అన్ని కూడా ఒకానొక సమయంలో ఒక ముద్దలా… బంతి ఆకారంలో కలిసి ఉండేవి. ఈ స్థితినే సింగ్యులారిటీ అంటాం. ఆ బిందువు వద్ద భౌతిక శాస్త్ర సూత్రాలేమి పనిచేయవు. అక్కడ కాలం, దిశలు అవి ఏమి ఉండవు.

అత్యధిక సాంద్రతతో ఒకే ముద్దలా కలిసి ఉన్న ఆ పదార్థంలో ఒత్తిడి అధికమై ఒకానొక సమయంలో అది పేలిపోయింది. దీనినే బిగ్ బ్యాంగ్ లేదా మహా విస్ఫోటనం అంటారు… అయితే బిగ్ బ్యాంగ్ జరిగిన క్షణమే సమయం అనేది పుట్టింది. అప్పటి నుంచి విశ్వం విస్తరిస్తూనే ఉంది.

Big bang Theory in Telugu
Big bang Theory in Telugu

బిగ్ బ్యాంగ్(Big bang) జరిగిన మొదటి మూడు నిమిషాలు అందులోని పదార్ధం అన్ని దిశలలో విస్తరించబడి అనేక మార్పులకు గురైంది. అలా విస్తరించబడిన పదార్ధం క్రమేపి చల్లబడి పాలపుంతలుగా, నక్షత్రాలుగా ఏర్పడింది. కొన్ని చోట్ల మరింత చల్లబడి గ్రహాలుగా ఏర్పడింది.

ఆ గ్రహాలలో వేల సంవత్సరాల పాటు జరిగిన రసాయనిక చర్యల వల్ల జీవం అనేది ఏర్పడింది. అలా ఏర్పడిందే మన భూమి కూడా…

అయితే బిగ్ బ్యాంగ్(Big bang) తరువాత విశ్వం అపరిమితంగా విస్తరిస్తూనే ఉంది. అయితే విశ్వం యొక్క విస్తరణపై సరైన నిరూపణలు లేకపోవడంతో ఈ వాదనని చాలా మంది కొట్టి పడేసారు.

తొలిసారి టెలీస్కోప్ ని కనుగొన్న తరువాత గెలీలియో విశ్వాఅంతరాలన్నిటిని దాని ద్వారా తరచి చూస్తున్నపుడు సుదూరంలో ఉన్న పాలపుంతలు, గాలక్సీ లు దూరంగా పారిపోతున్నట్టు కనిపించాయి. అంతే, విశ్వం విస్తరిస్తూనే ఉంది అనే వాదనకు బలం చేకూరింది.

ఇలా క్రమేపి వ్యాపిస్తున్న విశ్వ వ్యాపనం.. ఒకానొక దశలో ఆగిపోతుంది. అక్కడ నుంచి మళ్ళీ కుచించుకుపోవడం ప్రారంభమవుతుంది. అలా క్రమేపి కుచించుకుపోయి మళ్ళీ పూర్వ దశ అయిన ఏక బింధుత్వ దశకు చేరుకుంటుంది. మళ్ళీ బిగ్ బ్యాంగ్ చోటు చేసుకుంటుంది. ఇలా విశ్వ పరిణామం అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది….

You May Also Like: Gravity లేకపోతే ఏమేమి జరగవచ్చు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *