• Mangalyaan Success Story in Telugu
  Science,  Uncategorized

  MANGALYAAN Success Story in Telugu

  భూమి మీద జీవనానికి సంబంధించిన కొన్ని రహస్యాలు మార్స్ గ్రహం మీద ఉన్నాయనేది కొంతమంది శాస్త్రవేత్తల భావన. అలాగే కొన్ని దశాబ్దాల తరువాత భూమి మీద నివసించే విధంగానే, మార్స్ గ్రహం మీద కూడా నివసించే అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళ వాదన. దీనికోసం ‘మంగళయాన్’ (Mangalyaan)అనే ఉపగ్రహాన్ని మార్స్ గ్రహం మీదకు పంపారు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ  సిబ్బంది.  స్పేస్ రీసెర్చ్ లో భారత్ సత్తా చాటిన ‘ప్రయోగం’ ఇది. శ్రీహరికోట నుంచి రాకెట్ లాంచ్ ఆయినప్పటి నుంచి మార్స్ గ్రహాన్ని చేరుకునే వరకు మంగళయాన్(Mangalyaan) ప్రయాణం ఎలా సాగింది? ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఈ ఘనతని మంగళయాన్(Mangalyaan) సాధించింది? మంగళయాన్ ఎలా పనిచేస్తుంది? మార్స్ గ్రహం గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. అది నవంబర్ 5, 2013 శాస్త్రవేత్తలు రాకెట్ లాంచ్ చేయడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. టైమర్ పూర్తయ్యిన తరువాత రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.   ప్రయోగ సమయంలో శ్రీహరికోట, పోర్ట్ బ్లెయిర్, బ్రునై, ఇండోనేషియా లలో…

 • Success Stories

  APJ Abdul Kalam Biography in Telugu

  అబ్దుల్ కలాం(Abdul Kalam)… పరిచయం అవసరం లేని పేరు. ఈ పేరు వినని వారు అంటూ ఎవరూ ఉండరు… ఎక్కకో తమిళనాడులోని రామేశ్వరంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి అసామాన్య స్థాయికి ఎలా ఎదగగలిగారు? రామేశ్వరం నుంచి రాష్ట్రపతి స్థాయి వరకు ఆయన ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం… అబ్దుల్ కలాం(APJ Abdul Kalam) గారి అసలు పేరు అవుల్ ఫకీర్ జైనులబ్ధిన్ అబ్దుల్ కలాం. ఈయన అక్టోబర్ 15, 1931 లో తమిళనాడులోని, రామేశ్వరంలో జన్మించారు. అతి నిరుపేద కుటుంబంలో పుట్టిన కలాం(Abdul Kalam) స్వయం కృషితో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు. 1954 లో మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (MIT) లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో చేరారు కలాం. ఇంజనీరింగ్ పూర్తయ్యిన తరువాత ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం బెంగుళూరులోని ఏరోనాటిక్స్ (H.A.L) లో చేరారు. ట్రైనింగ్ తరువాత D.T.D.P (Air) లో జూనియర్ ఇంజనీర్ గా చేరారు. ఇందులో పవన విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వీలుగా విండ్ మిల్స్…

 • Science

  Why Onion Chopping Always Makes You Cry? in Telugu

  Onion కట్ చేస్తున్నప్పుడు కన్నీళ్లు రావడం మనం అందరం చూసే ఉంటాం… అసలు ఉల్లిపాయలను(Onions Chopping) కట్ చేస్తున్నప్పుడు కన్నీళ్లు ఎందుకు వస్తాయి? దీని వెనుక జరిగే రసాయనిక చర్యలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం… Short Description: ఉల్లిపాయలని కట్ చేసినపుడు ఉల్లి పొరల నుండి ఒకరకమైన గ్యాస్ అనేది బయటకి విడుదల అవుతుంది. ఈ పొరలనుండి విడుదలయిన గ్యాస్ ఉల్లిపాయలలో ఉండే మరొక రసాయనముతో కలవడం వల్ల వేరొక కొత్త రకమైన గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఫామ్ అయిన గ్యాస్ మన కంటిలోని తేమని తాకినప్పుడు మరొక కొత్త గ్యాస్ ఫామ్ అది కన్నీళ్లు రావడానికి కారణమవుడుతుంది. దీనిని కాస్త వివరంగా చూస్తే.. 1. సాధారణంగా ఉల్లిపాయ పొరలలో సింథేజ్ ఎంజైమ్(Synthase enzyme) కణాలు అనేవి పొదిగి ఉంటాయి. మనం ఉల్లిపాయలని కట్ చేస్తున్నప్పుడు ఉల్లిపాయలతో పాటుగా పొరలలో ఉన్న సింథేజ్ ఎంజైమ్ లు కూడా కట్ అయ్యి బయటకి వచ్చి అవి ఉల్లిపాయలలో గల ఎమినో ఆసిడ్ సల్ఫ్ ఆక్సైడ్(Amino…

 • How to Set a Goal in Telugu
  Success Stories

  How to Set a GOAL | Explained in Telugu

  కొత్త సంవత్సరం మొదలు కావడంతో చాలా మంది కొత్త కొత్త లక్ష్యాలను(Goal) ఏర్పరచుకునే ఆలోచనలో ఉంటారు. అయితే ఖచ్చితమయిన లక్ష్యాలను ఎలా ఏర్పరచుకోవాలి, ఆ లక్ష్యాలు(Goal) నెరవేరేందుకు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్పష్టత: మొదటిగా లక్ష్యాన్ని(Goal) ఏర్పరచుకోవడంలో మీకంటూ ఒక స్పష్టత  ఉండాలి. మీ జీవితంలో మీరు ఏమి సాదించాలనుకుంటున్నారో మీకు  ఖచ్చితమయిన స్పష్టత లేకపోతే మీ ఆలోచనలు కార్యాచరణ రూపం దాల్చలేవు. అప్పుడు సరైన గమ్యం(Goal) లేని ఒక గొప్ప ఆలోచన వృధా అయిపోతుంది, అది మీ జీవితానికి పెద్ద నిరుత్సాహాన్ని మిగులుస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. పక్కవారి గురించి పట్టించుకోకండి: ఏదైనా కొత్త లక్ష్యం(Goal) కానీ, కొత్త ఆలోచన కానీ నాలుగు దశల గుండా వెళ్లాల్సి ఉంటుంది. మొదటిగా దాన్ని ఎవరు పట్టించుకోరు, తరువాత వెక్కిరిస్తారు, ఆ తరువాత తీవ్రంగా ప్రతిఘటిస్తారు, చివరిగా అది స్వయంసిద్ధమైనదని, మీ విజయానికి చప్పట్లు కొడతారు. కాబట్టి, పక్క వారు ఏమనుకుంటారనో లేక నవ్వుతారనో, చిన్ని చిన్ని లక్ష్యాలను(Goal) ఏర్పరచుకోకండి. లక్ష్య నిర్ణయంలో మరియు లక్ష్య సాధనలో…

 • Science,  Uncategorized

  How are cyclones named? | Explained in Telugu

  తుఫాన్(Cyclones) లకి పేర్లు ఎలా పెడతారు? తుఫాన్(Cyclones) లకి రకరకాల పేర్లను పెడుతూ ఉంటారు.. హుద్ హుద్, తిత్లీ, లైలా… ఇప్పుడు పెథాయ్. వినడానికి విచిత్రంగా ఉండే ఈ పేర్లను(Names) ఎవరు పెడతారు, వేటి ఆధారంగా పెడతారో ఇప్పుడు తెలుసుకుందాం… ఇలా తుఫాన్ లకి పేర్లు పెట్టే సంప్రదాయం అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాలలో 1953 నుంచే ఉంది. ఐక్యరాజ్య సమితికి చెందిన “వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజషన్” అనే సంస్థ తుఫాన్(Cyclones) లకి పేర్లు పెట్టే పనులను చూసుకుంటుంది. కానీ, దక్షిణ ఆసియాలో ఈ మధ్య వరకు కూడా తుఫాన్ లకు పేర్లు(names) పెట్టే సాంప్రదాయం లేదు. ఇటీవలే ఈ సాంప్రదాయం మొదలయ్యింది. గతంలో చాలా ఏళ్ళు పాటు పసిఫిక్ మహా సముద్రంలో పుట్టిన చాలా తుఫాన్ లు ఏ పేరు లేకుండా అనామకంగానే ఉండిపోయాయి. తుఫాన్ లకు పేర్లు లేకపోతే వాటి గురించి వివరించడం, విశ్లేషించడం, చర్చించడం కాస్త గందరగోళంగా ఉంటోందని వాతావరణ నిపుణులు గ్రహించారు. దీనితో పాటుగా మీడియాలో ప్రసారం చేసేందుకు, ప్రజలను…

 • Science

  మనిషిలా ఆలోచించే సూపర్‌కంప్యూటర్‌ !

  మనిషిలా ఆలోచించే సూపర్‌కంప్యూటర్‌: ఈ ప్రపంచంలోని అంతుచిక్కని మరియు అర్థంకాని విషయాలలో మనిషి మెదడు ఒకటి.. మనం సాధించిన అద్భుతమైన ఈ సాంకేతిక అభివృద్ధికి కారణం మన మెదడు. ఈ  భూ ప్రపంచంలో ఇప్పటివరకు మానవ మేధస్సుతో సరి సమానంగా పని చేసే పరికరం ఏదీ లేదు.. దీన్ని కూడా ఛేదించి ‘ మానవ మేధస్సు తో సరిసమానంగా పని చేసే సూపర్ కంప్యూటర్(స్పిన్నకర్) ని కనుగొన్నారు బ్రిటన్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవే త్తలు. ఇటీవలే దీన్ని స్విచ్చ్ ఆన్ చేశారు. ఈ అద్భుతాన్నీ సాధించిన ఘనతకి కారణం కూడా మానవ మెదడు అనే చెప్పొచ్చు.. అసలు మన మెదడు ఎలా పనిచేస్తుంది ? ఎందుకు దానికి అంత ప్రత్యేకత..? మన మెదడులో సుమారుగా 100 బిలియన్ సంఖ్యలో న్యూరాన్లు అని పిలవబడే కణాలు ఉంటాయి. ప్రతీ న్యూరాన్ కూడా మరో 1000 కి పైగా న్యూరాన్లతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. మన శరీరానికి కావలసిన సమాచారం సిగ్నల్స్ రూపంలో ఒక న్యూరాన్ నుండి…

 • RedBus Success Story in Telugu
  Success Stories

  Redbus Success Story in Telugu

  అవసరం అన్వేషణకి మూలం. ఈరోజున మనం అనుభవిస్తున్న వస్తువులన్నీ ఏదోక రోజు ఒక అవసరం నుంచి పుట్టినవే… అలా పుట్టినదే Redbus Story కూడా… Redbus సృష్టికర్త అయిన ‘ఫణీంద్ర సామ’ నిజామాబాద్ జిల్లాలో తడపకల్ అనే గ్రామంలోజన్మించారు. బిట్స్ పిలానీలో ఎలెక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన బెంగుళూర్ లో జాబ్ చేస్తున్న సమయంలో 2 వారాలకి ఒకసారి బస్సులో ఇంటికి వెళ్లేవారు. ఇలా ఒక సంవత్సరం మొత్తం ఒక ట్రావెల్ ఏజెంట్ దగ్గర టిక్కెట్ కొనుక్కుని ప్రయాణంచేసేవారు.. అలా 2005 సంవత్సరం దీపావళికి ఇంటికి వెళ్దామని ట్రావెల్ ఏజెంట్ దగ్గరకి వెళ్లిన ఫణీకి ఆరోజు బస్సు టికెట్ దొరకలేదు. అక్కడే దగ్గర్లో ఉన్న మరో 4,5 ఏజెంట్లని టికెట్ కోసం అడగగా అక్కడ కూడా ఫలితం లేకపోయింది. ఇక చేసేదేమీ లేక రూమ్ కి వెనుతిరుగుతారు ఫనీంద్ర.. అలా వెనక్కి వచ్చిన ఫణికి ఇంజినీర్ ని అయ్యి ఉండి ఇలాంటి సమస్యకి పరిష్కారమేమి కనిపెట్టలేనా అనిపించింది… అంతే… టికెట్ కోసం వెళ్లిన చోట…

 • Success Stories,  Uncategorized

  Swiggy Success Story In Telugu

  ‘ఎక్కడో ఒక చోట జరిగిన చిన్న సంఘటన వేరే ఎక్కడో జరిగే పెద్ద పెనుమార్పుకి కారణమవ్వొచ్చు’ దీనినే బట్టర్ ఫ్లై ఎఫెక్ట్ అని అంటాం. అలా… ఎక్కడో బిట్స్ పిలానీలో చదువుకోసం వెళ్లిన శ్రీహర్ష మరియు నందన్ రెడ్డి అనే ఇద్దరి వ్యక్తుల కలయిక ఈరోజు Swiggy రూపుదాల్చుకోవడానికి మరియు దాని సక్సెస్ కి కారణమయ్యింది. ఈరోజున మనకి కావలసిన రెస్టారెంట్ ల నుంచి కావలసిన ఫుడ్ మన ఇంటికి నిమిషాలలో వచ్చేస్తోంది అంటే దానికి కారణం శ్రీహర్ష మరియు నందన్ రెడ్డి ల యొక్క కృషి ఫలితమే… అసలు Swiggy ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలయ్యింది? Swiggy సృష్టికర్తలు ఎవరు? Swiggy ఇంత సక్సెస్ అవ్వడానికి గల ఏమిటి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం… శ్రీహర్ష మరియు నందన్ లకి కాలేజీ రోజుల నుంచే ఏదోక బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి, మన కాళ్ళమీద మనం నిలబడి, 10 మందికి దారి చూపాలి అనే ఆలోచన ఉండేది. ఈ ఆలోచనే వాళ్లకి చదువు అవ్వగానే…