Artificial Moon, China in Telugu
Science,  Uncategorized

China Is going to Launch Its Own Artificial Moon in 2020

Artificial Moon (కృత్రిమ చందమామ) ను తయారుచేయనున్న చైనా:

చైనా దేశం 2020 సంవత్సరం నాటికి Artificial Moonను తయారు చేయనుంది. చైనా దేశంలో చెంగ్డూ అనే నగరానికి రాత్రి సమయాలలో స్ట్రీట్ లైట్స్ కి సరఫరా చేసే మొత్తం విద్యుత్ మరియు దాని యొక్క ఖర్చు అనేది భారీ మొత్తంలో అవుతుండటంతో ఈ సమస్యను అధిగమించేందుకు చైనా దేశం Artificial Moon (కృత్రిమ చందమామ) ను తయారు చేయడానికి సంసిద్ధమైంది .

చైనాలోని అత్యధిక జనాభా కలిగిన నగరాలలో చెంగ్డూ నగరం ఒకటి. ఈ నగరంలో సుమారుగా 10 మిలియన్ల జనాభా నివసిస్తున్నారు. అయితే ఈ నగరంలోని స్ట్రీట్ లైట్స్ యొక్క విద్యుత్ సరఫరాకి గత కొద్ది సంవత్సరాలుగా ఇబ్బంది వాటిళ్లుతూనే ఉంది. దీనికి శాశ్వత పరిష్కారాన్ని చూపేందుకు చైనా Artificial Moon ని తయారు చేయనుంది.

Artificial Moon, China
Artificial Moon, China

చైనా మీడియా నివేదిక ప్రకారం మానవ నిర్మితమైన ఈ చందమామ చెంగ్డూ నగరానికి భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులోనున్న కక్షలో 2020 నాటికి చైనా ప్రవేశపెట్టనుంది. రాత్రి సమయాలలో నగరానికి వెలుతురునివ్వడంతో పాటు, మొత్తం నగరంలోని స్ట్రీట్ లైట్స్ కోసం అయ్యే ఖర్చులో 174 మిలియన్ల డాలర్లని ఆదా చేయనుంది ఈ Artificial Moon.

ఈ కృత్రిమ చందమామ అనేది మామూలు చందమామ కన్నా 8 రెట్లు ప్రకాశవంతంగా ఉంటుంది. కానీ భూమి నుంచి చూసేవారికి ఆ కాంతి అనేది స్ట్రీట్ లైట్ కాంతి కన్నా తక్కువగానే కనిపిస్తుందని, ఈ చంద్రుని యొక్క కాంతి తీవ్రతను మనం పెంచుకోవడం, తగ్గించుకోవడం చేయవచ్చు, చైనా ప్రజలు ఖచ్చితమైన చంద్రునిని చూడగలుగుతారు, కానీ భూమిపై ఉన్న ఇతర ప్రాంతాలకు ఇది ఒక ప్రకాశవంతమైన నక్షత్రంలా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Artificial Moon అనేది ఒక ప్రకాశవంతమైన ఉపగ్రహము. ఇది ప్రతిబింబ పూత (Reflecting Layer) తో నిండి ఉంటుంది, సూర్యకాంతి చంద్రుని మీద పడి మనకి చంద్రకాంతి లభిస్తున్నట్టే, ఈ కృతిమ చందమామ మీద పడిన సూర్య కాంతిని అది చెంగ్డూ నగరానికి రిఫ్లెక్ట్ చేస్తూ రాత్రి సమయాలలో కాంతిని ఇస్తుంది.

ఇది విజయవంతం అయితే 2022 నాటికి ఆకాశాన్ని మరో మూడు చంద్రులను ఆవిష్కరించనుంది చైనా .

You May Also Like: గొంగళి పురుగు మన ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించనుందా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *