Success Stories

APJ Abdul Kalam Biography in Telugu

అబ్దుల్ కలాం(Abdul Kalam)… పరిచయం అవసరం లేని పేరు. ఈ పేరు వినని వారు అంటూ ఎవరూ ఉండరు… ఎక్కకో తమిళనాడులోని రామేశ్వరంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి అసామాన్య స్థాయికి ఎలా ఎదగగలిగారు? రామేశ్వరం నుంచి రాష్ట్రపతి స్థాయి వరకు ఆయన ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం…

అబ్దుల్ కలాం(APJ Abdul Kalam) గారి అసలు పేరు అవుల్ ఫకీర్ జైనులబ్ధిన్ అబ్దుల్ కలాం. ఈయన అక్టోబర్ 15, 1931 లో తమిళనాడులోని, రామేశ్వరంలో జన్మించారు.

Abdul Kalam Biography in Telugu
Abdul Kalam Biography in Telugu

అతి నిరుపేద కుటుంబంలో పుట్టిన కలాం(Abdul Kalam) స్వయం కృషితో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు. 1954 లో మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (MIT) లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో చేరారు కలాం.

ఇంజనీరింగ్ పూర్తయ్యిన తరువాత ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం బెంగుళూరులోని ఏరోనాటిక్స్ (H.A.L) లో చేరారు. ట్రైనింగ్ తరువాత D.T.D.P (Air) లో జూనియర్ ఇంజనీర్ గా చేరారు.

ఇందులో పవన విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వీలుగా విండ్ మిల్స్ డిజైన్ రూపొందించే విభాగంలో ఉండేవారు. గాలి వల్ల రోటార్ బ్లేడ్స్ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రోటర్ కు జనరేటర్ ను అమర్చి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.

అప్పట్లో కలాం గారు(Abdul Kalam) ఈ రోటార్ ని వాటర్ పంప్ కి అనుసంధానించారు. బావిలోని నీటిని స్టోరేజ్ ట్యాంక్ లోకి పంపడానికి ఇది ఉపయోగపడేది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమయ్యింది. దీన్ని ఢిల్లీలో కూడా ప్రదర్శించారు.

ఆ తరువాత డకోటా ఎయిర్ క్రాఫ్ట్ కు అమర్చటానికి టార్గెట్ లను తయారుచేసే ప్రాజెక్టుని అబ్దుల్ కలాం(Abdul kalam) ప్రారంభించారు. ఈ టార్గెట్ లను యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ తో చేధిస్తారు. ఈ టార్గెట్ లని కాంపోజిట్ మెటీరియల్స్ ఉపయోగించి రూపొందించడం జరిగింది. అప్పటికాలంలో అదొక వినూత్న ప్రయోగంగా గుజరాత్ లోని జామ్ నగర్ లో వీటిని విజయవంతంగా పరీక్షించారు. ఈ రెండు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన కలాం రక్షణ శాఖకు చెందిన బెంగుళూరులోని ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కి మారిపోయారు.

అక్కడ కలాంకు గ్రౌండ్ ఎఫెక్ట్ మిషన్స్ ను తయారు చేసే బాధ్యత అప్పగించారు, వీటినే ఇప్పుడు హోవర్ క్రాఫ్ట్లు అని పిలుస్తున్నారు. ఇవి నేల మీదా మరియు సముద్రంలో కూడా ప్రయాణించగలవు. వీటిని తీర ప్రాంతాలకు సైనికులను తరలించటానికి ఉపయోగిస్తుంటారు, అబ్దుల్ కలాం(Abdul kalam) దీని నమూనాను తయారు చేశారు. అప్పట్లో వి.కె. కృష్ణమీనన్ రక్షణమంత్రిగా ఉండేవారు.

Abdul kalam Hovercraft Project
Abdul kalam Hovercraft Project

ఈ ప్రొటో టైప్ ను మీనన్ పరీక్షించారు. అదే సమయంలో ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ తుంబ ఈక్వోటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ (దీనికే తర్వాత ఇస్రో గా పేరు మార్చారు)లో పని చేయటానికి శాస్త్రవేత్తల కోసం వెతకటం ప్రారంభించారు. కలాం పని తీరుని చూసి ఆకర్షితుడైన ఆయన వెంటనే అతనిని తన సంస్తలోకి తీసుకున్నారు.

ఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్ డివిజన్ బాధ్యతలను అప్పగించారు. రీ ఇన్ ఫోర్స్డ్ ప్లాస్టిక్స్ – ప్రత్యేకత ఏమిటంటే వాటి బరువు తక్కువ, బలం ఎక్కువ. అంతరిక్ష ప్రయోగాలకు ఇవి , బాగా పనికి వస్తాయి. వీటిని రాకెట్ మోటార్ యింజన్స్, కంట్రోల్ ఫిన్స్, నాజిల్స్ మొదలైనవి తయారు చేయటానికి ఉపయోగిస్తారు.

ఈ రంగంలో కలాం కంట్రిబ్యూషన్ – ఫిలమెంట్ వైండింగ్ మిషన్, దీని ద్వారా రాకెట్ మోటారులకు అవసరమైన ట్యూబీని తయారు చేయటానికి వీలుంటుంది. ఆ తర్వాత కలాం SLV – 3 (శాటిలైట్ లాంచింగ్ వెహికిల్)కి ప్రాజెక్టు డైరెక్టర్ అయ్యారు.. SLV – 3 పరీక్ష విఫలమైంది. అది ఎందుకు విఫలమైందో విశ్లేషించి చెప్పటంలో కలాం , విజయం సాధించారు.

నిపుణులతోను, విద్యాసంస్థల మేధావులతోను విస్తృతంగా చర్చలు జరిపి అసలు కారణాన్ని కనుగొనగలిగారు. ఆ తర్వాత కలాం రెండుసార్లు S.L.V – 3 ను విజయవంతంగా పరీక్షించారు.

Abdul Kalam SLV Project
Abdul Kalam SLV Project

ఆ తర్వాత కలాం హైదరాబాద్ లోని D.R.D.L. కి డైరెక్టరుగా వచ్చారు. ఆ సమయంలోనే అగ్ని, త్రిశూల్, పృథ్వీ, ఆకాష్, నాగ్ మొదలైన క్షిపణుల రూపకల్పనలో కలాం ప్రముఖ పాత్ర వహించారు. తనదైన శైలిలో ప్రతి ఒక్కరిని మెప్పించి, ఒప్పించగల కలాం సమర్ధవంతమైన టీమ్స్ తయారు చేసి ఎన్నో మంచి ఫలితాలు సాధించగలిగారు.

సామాన్య కుటుంబంలో జన్మించినా పట్టుదలతో శాస్త్రజ్ఞుడిగా సైంటిఫిక్ ప్రెసిడెంట్గా భారతదేశానికి వన్నె తెచ్చిన అబ్దుల్ కలాం మన దేశ రాష్ట్రపతిగా అత్యున్నత పదవికి చేరుకొని నేటి యువతకి ఎంతో ఆదర్శప్రాయులుగా నిలిచారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా లక్ష్య సాధన దిశగా పయనించి లక్ష్యాన్ని ఛేదించటంలోనే అసలైన ఆనందం ఉంటుందని చెప్పిన ఆయన జీవితం మన అందరికీ స్ఫూర్తిదాయకం.

You May Also like: Best Success Quotes తెలుగులో..

THANK YOU

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *