• Life Style,  Uncategorized

  Is Fasting is Good for Health?

    ఉపవాసం ఉండటం ఆరోగ్యపరంగా మంచిదేనా? ‘లంకణం పరమౌషధం’ అన్నారు పెద్దలు. ఆ సంగతి ఎలా ఉన్నా దేవుడి పేరుతో అసలేమీ తినకుండా కటిక ఉపవాసం చేసేవాళ్లు కొందరయితే, మితాహారంతో పాక్షిక ఉపవాసం చేసేవాళ్లు మరికొందరు. కారణమేదయినా పూర్తిగా తినడం మానేయడం కన్నా ఒకపూట భోజనం చేసి, మరో పూట ఏ పండ్లో తినడం మంచిదే అన్నది మన వైద్యుల మాట. ఈ పాక్షిక ఉపవాసం ఆరోగ్యానికి మంచిదేనని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకు చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. దీని వల్ల బరువు తగ్గడంతోపాటు బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్… వంటివి కూడా తగ్గుతాయట. ఇలా తరచూ ఉపవాసాలుండటం వల్ల ఆయుఃప్రమాణం కూడా పెరుగుతుందట. ఇందుకోసం కొందరికి ఒకరోజు వాళ్లు రోజువారీ తీసుకునే ఆహారంలో 25 శాతాన్నీ, మరోరోజు ముందురోజు తగ్గించినదానితో కలిపి 175 శాతాన్నీ ఇచ్చారట. ఇలా ఒకరోజు ఉపవాసం, మరో రోజు విందుభోజనం చేయడం వల్ల మూడు వారాలు గడిచేసరికి వాళ్లలో మొత్తంగా యాంటీఆక్సిడెంట్ల పనితీరు మెరుగయిందట. అంటే శరీరానికి అప్పుడప్పుడూ కొంత ఇబ్బందినీ ఒత్తిడినీ…

 • Success Stories,  Uncategorized

  The Street Store.Org Success Story

    The Street Store.Org Success Story in Telugu “మనకిష్టమైన బట్టలు మనం వేసుకుందాం…. పక్కన పడేసిన బట్టలను లేనివారికిచ్చి వారి కళ్లలో ఆనందం చూద్దాం…’ అన్న ఆలోచనతో మొదలైందే ‘ద స్ట్రీట్ స్టోర్’. దీనిని ఎవరైనా ప్రారంభించొచ్చు, ఎవరైనా సహాయం చేయొచ్చు. మీ స్నేహితులతో కలిసి మీరు కూడా పేదలకి మీ వంతు సహాయాన్ని అందివ్వవచ్చు. తమకవసరం లేనివి వేరేవారికి ఉపయోగపడతాయనుకుంటే చాలామంది ఇవ్వాలనే అనుకుంటారు. అవి బట్టలు కావొచ్చు, బూట్లు, చెప్పులు, దుప్పట్లు ఇలా ఏమైనా అవ్వొచ్చు.. కానీ నిజంగా వాటి అవసరం ఉన్నవారిని పట్టుకోవాలంటేనే సమస్య.. ఇక, తీసుకునే వారి విషయానికొస్తే… ఎంత నిరు పేదలైనా ఏది పడితే అది వేసుకోలేరు. వారికి సౌకర్యంగా ఉన్నవీ, నచ్చినవీ వేసుకున్నప్పుడు ఉండే సంతోషం వేరు. అందుకే, దాతలకు ఓ వేదికను ఏర్పాటు చేయడంతో పాటు పేదలకు కూడా అందరిలానే తమకు నచ్చింది తామే ఎంపికచేసుకునే అవకాశం కల్పించాలనుకున్నారు దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ కు చెందిన స్నేహితులు కైలీ లెవిటన్,మ్యాక్స్ పజక్. అలా…

 • Guinness-Records-in-Telugu-Telugu Forbes
  Guinness Records,  Uncategorized

  Guinness World Records in Telugu – Episode 1

    1. మీరు చూస్తున్న ఈమె పేరు ‘క్సీ కుపింగ్’ .చైనాకి చెందిన ఈమె ప్రపంచంలోనే అత్యంత పొడవయిన జడ కలిగిన స్త్రీగా గిన్నెస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది. 5.627 మీటర్ల పొడవుతో (18 అడుగుల 5.54 అంగుళాలు)  మే 8, 2004 వ సంవత్సరంలో ఈమె గిన్నెస్ రికార్డు ను కైవసం చేసుకుంది.     2. ఈమె పేరు ‘హర్నామ్ కౌర్’. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఈమె ప్రపంచంలోనే పొడవైన గెడ్డం(6  అంగుళాలు) కలిగిన యువతిగా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది.     3. మీరు చూస్తున్న ఈమె పేరు ‘లీ రెడ్ మాండ్’ . అమెరికాకు చెందిన ఈమె ప్రపంచంలోనే రెండు చేతులకీ పొడవైన గోళ్లు కలిగిన స్త్రీగా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది. ఈమె అన్ని వేళ్ళ గోళ్లు యొక్క పొడవు 8.65 మీటర్లు (28 అడుగుల  4.5 అంగుళాలు)   4. ఈమె పేరు ‘ఎకటేరిన లిసినా’. రష్యాకి చెందిన ఈమె  ప్రపంచంలోనే…